మినుము రైతుకు అపార నష్టం

ABN , First Publish Date - 2023-03-19T00:45:37+05:30 IST

అకాల వర్షానికి మినుము రైతులు నట్టేట మునిగారు.

మినుము రైతుకు అపార నష్టం
భావదేవరపల్లిలో తడిసిన మినుము పైరును చూపుతున్న టీడీపీ నాయకులు

గుడివాడ రూరల్‌, మార్చి 18 : గుడివాడ రూరల్‌ మండలంలో శనివారం కురిసిన అకాల వర్షానికి మినుము రైతులు నట్టేట మునిగారు. మండలంలో సగానికిపైగా మినుము నూర్పిళ్ల దశలో ఉంది. పొలాల్లో చిన్న చిన్న గుట్టలు వేసి నూర్పిస్తున్నారు. అకాల వర్షం కారణంగా మినుము పైరు మొత్తం తడిసి ముద్దయింది. మినుము పంట చాలా వరకు పాడువుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచి రేటు వస్తుందని, పంట చక్కగా పండిందని సంతోషంలో ఉన్న సమయంలో వరుణ దేవుడు ఒక్కసారిగా విరుచుకుపడటంతో మొత్తం పంట వర్షం పాలయిందని రైతులు వాపోయారు. గుడ్లవల్లేరు : అకాల వర్షం రైతు కష్టాన్ని మింగేసింది. అకాల వర్షం గుడ్లవల్లేరు మం డలంలో వడ్లమన్నాడు, వేమవరం, కౌతవరం, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో మినుము రైతుకు నష్టం కలిగించింది. పనలపై ఉన్న మినుము, కోత కోయాల్సిన పంట నీట మునిగింది. పంటంతా నీటిలో నానుతోంది. ప్రభుత్వం అప రా రైతును ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నాగాయ లంక : రెండ్రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు మినుము రైతులను నిలువునా ముంచాయి. అపరాల మీద పెట్టుకున్న ఆశలను ఆడియాసలు చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 7,848 ఎకరాలలో మి నుము పైరును రైతులు వేశారు. కొన్ని ప్రాంతాలలో మిను ము పంటను తీసి యంత్రాల ద్వారా నూర్చిఇంటికి చేర్చారు. ఇంతలో అకాల వర్షాలు రావటంతో 250 నుంచి 300 ఎకరాల లోపు మినుము పంట చేనులో గుట్టలుగానే ఉండి తడిసిపోయింది. తడిసిన మినము మొలకలు రావటం, మినుము కాయలకు బూజు రావటంతో నష్టం తప్పదని వాపోతున్నారు. కోయని మినుము పంట దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. మండల టీడీపీ నేతలు శనివారం భావదేవరపల్లిలోని తడిసిన మినుము పంటను పరిశీలించారు. తడిసిన, రంగుమారిన మినుములను ప్రభుత్వం కొనుగోలు చేయాలని మెండు లక్ష్మణరావు, బావిరెడ్డి వెంకటేశ్వరరావు, మండలి ఉదయభాస్కర్‌ తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంట నష్టం వాటిల్లిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని కోరారు. అవనిగడ్డ రూరల్‌ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు మినుముకు నష్టం కలిగించాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన మినుము పంటను ఆరబెట్టుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. మరి కొంత ప్రాంతంలో మినుము పంటలో నీరు నిలిచి చేతికి రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చల్లపల్లి : మినుపకాయ తీత పనులు చేపట్టి మినుము కుప్పలుగా పొలాల్లోనే ఉండటంతో వర్షాలకు పూర్తిగా తడిసిపోయింది. రోజుల తరబడి భారీ వర్షం పలు దఫాలుగా కురుస్తూనే ఉండటంతో మిన పకాయ తడుస్తూనే ఉంది. వర్షాలతో మినుము దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినపకాయ తీత పనులు పూర్తయిన వారు కుప్పలు వేసుకుని పరదాలు కప్పుకుని పంటను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఆదివారం సైతం వర్షాలు కురుస్తాయనే హెచ్చరికతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-03-19T00:45:37+05:30 IST