Lanka Dinakar: కేంద్ర బడ్జెట్ 2023-24 సమ్మిళిత వృద్ధిని సూచిస్తున్నది..

ABN , First Publish Date - 2023-02-01T15:04:07+05:30 IST

నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్‌ (Parliement)లో ప్రవేశపెట్టిన బడ్జెట్ (Budget) 2023 -24 సమ్మిళిత వృద్ధిని సూచిస్తున్నదని బీజేపీ నేత లంకా దినకర్ (Lanka Dinakar) అన్నారు.

Lanka Dinakar: కేంద్ర బడ్జెట్ 2023-24 సమ్మిళిత వృద్ధిని సూచిస్తున్నది..

అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్‌ (Parliement)లో ప్రవేశపెట్టిన బడ్జెట్ (Budget) 2023 -24 సమ్మిళిత వృద్ధిని సూచిస్తున్నదని బీజేపీ నేత లంకా దినకర్ (Lanka Dinakar) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గరీబ్ కల్యాణ యోజన, ఉపాధి కల్పనా అంత్యోదయ స్ఫూర్తి ఈ బడ్జెట్‌లో కనబడుతోందన్నారు. రూ. 10 లక్షల కోట్లతో మూలధన వ్యయం ఉత్పాదక ఆస్తుల కల్పనకు ఊతం ఇస్తోందన్నారు. రైల్వే బడ్జెట్ 2.40 లక్షల కోట్లకు పెంచడం అంటే రైల్వే మౌలిక సదుపాయాలు పెంచడానికేనని అర్ధమవుతోందన్నారు. వ్యక్తిగత, వేతన ఆదాయ వర్గాలకు ఊరట లభిస్తుందని, రాష్ట్రాలకు రూ. 1.30 లక్షల కోట్ల మేరకు వడ్డీలేని 50 సంవత్సరాలకు మూలధన వ్యయం కోసం రుణాలు రాష్ట్రల మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగమని లంకా దినకర్ వ్యాఖ్యానించారు.

కాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు 2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. ఈ బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట వేశారు. దాదాపు ఓ దశాబ్దంలో అత్యధికంగా, గత ఏడాది కన్నా నాలుగు రెట్ల వరకు ఈ రైల్వే బడ్జెట్ ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టడానికి ముందు యూపీఏ ప్రభుత్వం చేసిన ఖర్చు కన్నా తొమ్మిది రెట్లు ఎక్కువ వ్యయం చేయబోతున్నట్లు నిర్మల తెలిపారు.

పార్లమెంటులో నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ, 2013-14 బడ్జెట్‌లో రైల్వేలకు కేటాయించినదాని కన్నా తొమ్మిది రెట్లు, అంటే రూ.2.4 లక్షల కోట్లు 2023-24 బడ్జెట్లో కేటాయించినట్లు తెలిపారు. రైల్వేల అభివృద్ధికి దోహదపడే మరొక పథకాన్ని కూడా ఆమె ప్రకటించారు. 100 క్రిటికల్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు, వీటి కోసం రూ.75,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-02-01T15:04:11+05:30 IST