వీఆర్‌లోకి భవానీపురం ఇన్‌స్పెక్టర్‌

ABN , First Publish Date - 2023-03-23T00:09:19+05:30 IST

భవానీపురం ఇన్‌స్పెక్టర్‌ ఎండీ ఉమర్‌ను వీఆర్‌కు పంపుతూ ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ టి.కాంతిరాణా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయవాది కుమార్తెపై జరిగిన లైంగిక వేధింపులపై కేసు నమోదు చేయకుండా బాధిత తండ్రిపై నమోదు చేశారని న్యాయవాదులు ఆందోళన చేశారు.

 వీఆర్‌లోకి భవానీపురం ఇన్‌స్పెక్టర్‌

విజయవాడ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : భవానీపురం ఇన్‌స్పెక్టర్‌ ఎండీ ఉమర్‌ను వీఆర్‌కు పంపుతూ ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ టి.కాంతిరాణా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయవాది కుమార్తెపై జరిగిన లైంగిక వేధింపులపై కేసు నమోదు చేయకుండా బాధిత తండ్రిపై నమోదు చేశారని న్యాయవాదులు ఆందోళన చేశారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై దిశ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయవాదిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. న్యాయవాదుల ఆందోళన చేయడంతో పోలీసు కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. ఉమర్‌ను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు ఇచ్చారు. భవానీపురం ఇన్‌ఛార్జి బాధ్యతలను వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌రెడ్డికి అప్పగించినట్టు సమాచారం.

Updated Date - 2023-03-23T00:09:19+05:30 IST