పౌష్టికాహారంతో మెరుగైన ఆరోగ్యం
ABN , First Publish Date - 2023-09-22T00:50:13+05:30 IST
పౌష్టికాహారంతో విద్యార్థులకు మెరుగైన ఆరో గ్యం సాధ్యమవుతుందని కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు.
కానూరు హైస్కూల్‌లో కలెక్టర్ పి.రాజాబాబు ఆకస్మిక తనిఖీ
పెనమలూరు, సెప్టెంబరు 21: పౌష్టికాహారంతో విద్యార్థులకు మెరుగైన ఆరో గ్యం సాధ్యమవుతుందని కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. గురువారం కానూరు ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న రాగిజావను ఆయన తాగి, పరిశీలించారు. పాఠశాలలో చదువుతున్న 561 మంది విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలని ఉపాఽధ్యాయులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఈవో తాహెరా సుల్తానా, డిప్యూటీ ఈవో పద్మరాణి, పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.