రౌడీషీటర్‌ శ్రీను నగర బహిష్కరణ మరో ఆరు నెలలు పొడిగింపు

ABN , First Publish Date - 2023-01-18T00:37:23+05:30 IST

నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్న రౌడీషీటర్‌ శ్రీను నగర బహిష్కరణను మరో ఆరు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా తెలిపారు.

రౌడీషీటర్‌ శ్రీను నగర బహిష్కరణ   మరో ఆరు నెలలు పొడిగింపు

రౌడీషీటర్‌ శ్రీను నగర బహిష్కరణ

మరో ఆరు నెలలు పొడిగింపు

నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా

గుణదల, జనవరి 17: నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్న రౌడీషీటర్‌ శ్రీను నగర బహిష్కరణను మరో ఆరు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా తెలిపారు. మగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీషీట్‌ ఉన్న బెవర శ్రీను అలియాస్‌ పిళ్లా శ్రీనును గత ఏడాది నగరం నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. శ్రీను ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాని కారణంగా నగర బహిష్కరణ గడువు ముగియడంతో మరో 6 నెలలు నగరం నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మల్లిఖార్జున పేట ఉప్పరవాగు ఏరియాకు చెందిన బేవర శ్రీను అలియాస్‌ పిళ్లా శ్రీను పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినా అతని ప్రవర్తనలో మార్పు కనబడటం లేదన్నారు. దానికి తోడు సంఘ విద్రోహకార్యకలాపాలకు పాల్పడుతుండటంతో అతనిని నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.

Updated Date - 2023-01-18T00:38:58+05:30 IST