25న విద్యాసంస్థల బంద్‌

ABN , First Publish Date - 2023-07-22T01:33:36+05:30 IST

‘‘జీవో 77ను రద్దు చేయాలని, ప్రతివిద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వా లని, మెగా డీఎస్సీ నిర్వహించాలని వంటి పలు డిమాండ్లు ఆమోదించాలని ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ పాటిస్తున్నాం.’’ అని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్‌ తెలిపారు.

25న విద్యాసంస్థల బంద్‌

విద్యాధరపురం, జూలై 21: ‘‘జీవో 77ను రద్దు చేయాలని, ప్రతివిద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వా లని, మెగా డీఎస్సీ నిర్వహించాలని వంటి పలు డిమాండ్లు ఆమోదించాలని ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ పాటిస్తున్నాం.’’ అని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ బంద్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమా వేశంలో శ్రీనివాస్‌ మాట్లాడారు. అబద్ధపు ప్రచారాలతో విద్యార్థులు, నిరుద్యోగులను నమ్మించి సీఎం జగన్‌రెడ్డి గద్దె నెక్కారని, విద్యార్థులు, నిరుద్యోగులు అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు.

Updated Date - 2023-07-22T01:33:36+05:30 IST