వైసీపీ పాలనలో అధ్వానంగా రోడ్లు
ABN , First Publish Date - 2023-11-20T01:01:42+05:30 IST
వైసీపీ పాలనలో రోడ్లు అధ్వా నంగా ఉండి, నరకకూపాలను తలపిస్తున్నాయని టీడీపీ మండల అధ్య క్షుడు వీరంకి వీరాస్వామి పేర్కొన్నారు.

టీడీపీ- జనసేన ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ పేరుతో నిరసన
నందిగామ రూరల్, నవంబరు 19: వైసీపీ పాలనలో రోడ్లు అధ్వా నంగా ఉండి, నరకకూపాలను తలపిస్తున్నాయని టీడీపీ మండల అధ్య క్షుడు వీరంకి వీరాస్వామి పేర్కొన్నారు. మండలంలోని చెర్వుకొమ్ము పాలెం-పెద్దవరం రహదారిపై టీడీపీ, జనసేన నాయకులు ఆదివారం గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంతల రహదారితో నిత్యం ప్రమాదాలు జరుగుతూ వందల మంది ప్రమాదాల బారిన పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారులు అభివృద్ధి చేయాలని కోరారు. నాయ కులు ఉమ్మనేని విక్రమ్, గరిమిడి సురేష్, జమ్ముల విష్ణు, ఇంటూరి సీతయ్య, కోటేశ్వరరావు పాల్గొన్నారు.