Share News

గ్రూప్స్‌ పరీక్షలపై రేపు అవగాహన

ABN , Publish Date - Dec 18 , 2023 | 01:35 AM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈనెల 19న అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్‌ ఎన్టీఆర్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు మచ్చా శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

గ్రూప్స్‌ పరీక్షలపై రేపు అవగాహన

తిరువూరు, డిసెంబరు 17: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈనెల 19న అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్‌ ఎన్టీఆర్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు మచ్చా శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బోసుబొమ్మ సెంటర్‌లోని విన్నర్స్‌ కోచింగ్‌ సెంటర్‌లో మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు నిర్వహించే సదస్సుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు పలు అంశాలు వివరిస్తారని, ఆంధ్ర ప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, సంస్కృతి మెటీరియల్‌ అంది స్తామని తెలిపారు. గ్రూప్స్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సద స్సును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - Dec 18 , 2023 | 01:35 AM