త్రిపురలో ప్రజా సంఘాల కార్యకర్తలపై దాడులు అరికట్టాలి

ABN , First Publish Date - 2023-03-19T01:00:40+05:30 IST

త్రిపుర రాష్ట్రంలో సీఐటీయూ ప్రజాసంఘాల కార్యకర్తలపై బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ దాడులు ఖండించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రఽ దాన కార్యదర్శి సీహెచ్‌ నరసింగరావు కోరారు.

త్రిపురలో ప్రజా సంఘాల కార్యకర్తలపై దాడులు అరికట్టాలి

గవర్నర్‌పేట, మార్చి 18 : త్రిపుర రాష్ట్రంలో సీఐటీయూ ప్రజాసంఘాల కార్యకర్తలపై బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ దాడులు ఖండించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రఽ దాన కార్యదర్శి సీహెచ్‌ నరసింగరావు కోరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం లెనిన్‌ సెంటర్‌లో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడులతో నష్టపోయిన కార్మికులను ఆదుకోవడానికి ఆర్థికంగా సాయం అందించాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. గత నెలలో త్రిపుర రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగాయని, అనేక అక్రమాలకు పాల్పడి తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ వామపక్ష పార్టీల కార్యకర్తలను, ప్రజాసంఘాల నేతల్ని, సానుభూతిపరుల్ని వేధిస్తోందన్నారు. బీజేపీ మొదటిసారి పాలనా కాలంలో నష్టపోయిన త్రిపుర ప్రజానీకం బీజేపికి వ్యతిరేకంగా ఓటు చేశారని, 12శాతం ఓట్లు బీజేపీ కోల్పోయిందని, సీట్లు, ఓట్లు కోల్పోయిన బీజేపీ అక్కసుతో దాడులకు దిగుతోందన్నారు. ఇప్పటికే వెయ్యి మందికి పైగా కార్యకర్తలు దాడుల్లో గాయపడ్డారని, పిల్లలు పరీక్షలు రాయలేని పరిస్థితి ఉందన్నారు. ట్రేడ్‌ యూనియన్‌ కార్యాలయాలపై దాడులు, ధ్వంసం చేస్తూ భయానక పరిస్థితులు కల్పిస్తున్నారన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలకు యావత్తు ప్రజానీకం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సీహెచ్‌ శ్రీనివాస్‌, సెంట్రల్‌ కమిటీ అధ్యక్షుడు కె. దుర్గారావు, నేతలు ఎంవీ సుధాకర్‌, వై. సుబ్బారావు, ఎం.బాబూరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T01:00:40+05:30 IST