సీఎం తిరువూరు పర్యటనకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-03-19T00:45:04+05:30 IST

ముఖ్యమంత్రి వైఎ్‌స.జగన్మోహన్‌రెడ్డి ఈనెల 19న తిరువూరు పర్యటన పురస్కరించుకొని మండల పరిషత్‌రోడ్డు, ప్రధాన రహదారితో పాటు పలుప్రాంతాల్లో ప్రజలు రాకపోకలు నిర్వహించకుండా బారికేడ్లు, పరదాలు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం మండల పరిషత్‌రోడ్డులో చెట్ల కొమ్మలు తొలగించడంతో పాటుగా, కిందకు ఉన్న విద్యుత్‌ సర్వీసు వైర్లు, సీటీ కేబుల్‌, నెట్‌ కేబుల్‌ వైర్లు తొలగించారు.

సీఎం తిరువూరు పర్యటనకు ఏర్పాట్లు

తిరువూరు, మార్చి 18 : ముఖ్యమంత్రి వైఎ్‌స.జగన్మోహన్‌రెడ్డి ఈనెల 19న తిరువూరు పర్యటన పురస్కరించుకొని మండల పరిషత్‌రోడ్డు, ప్రధాన రహదారితో పాటు పలుప్రాంతాల్లో ప్రజలు రాకపోకలు నిర్వహించకుండా బారికేడ్లు, పరదాలు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం మండల పరిషత్‌రోడ్డులో చెట్ల కొమ్మలు తొలగించడంతో పాటుగా, కిందకు ఉన్న విద్యుత్‌ సర్వీసు వైర్లు, సీటీ కేబుల్‌, నెట్‌ కేబుల్‌ వైర్లు తొలగించారు. ఇంజనీరింగ్‌ కాలేజీ సమీపంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వెళ్లే రోడ్డు మార్గంలో మండల పరిషత్‌ రోడ్డుకు ఇరువైపులా ఉన్న లింకురోడ్ల వద్ద బారికేడ్‌ ఏర్పాటుకు పోల్స్‌ ఏర్పాటు చేశారు. రహదారికి ఇరువైపులా పరదాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం గం3గంటల వరకు పట్టణంలోకి ఎటువంటి వాహనాలు రాకుండా అన్ని రోడ్లును దిగ్బంధనం చేస్తున్నారు. బోసుబొమ్మ సెంటర్‌ నుంచి సెంటర్‌ డివైడర్‌కు రంగులు అద్దారు. మండల పరిషత్‌ రోడ్డు ప్రాంతంలో ఉన్న కూరగాయల షాపులో బస్సు తగులుతుందని కొంత భాగం తొలగించారు.

ఈదురు గాలులు.. భారీ వర్షం.. నేల కొరిగిన ఫ్లెక్సీలు

పట్టణంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గాలులకు ముఖ్యమంత్రి పర్యటనకు వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నెలకొరిగాగాయి. సభస్ధలి వద్ద బురద అవ్వకుండా వెట్‌మిర్చర్‌ తోలించారు. ఉదయం సభాస్ధలి ప్రాంతాన్ని విజయవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ మేరిప్రశాంతి, ఆర్డీవోలు పరిశీలించారు. సీఎం పోగ్రాం కో-ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Updated Date - 2023-03-19T00:45:04+05:30 IST