ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2023-03-05T00:28:31+05:30 IST

ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ పింటు నంది అన్నారు. రామవరప్పాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కొండ పావులూరు సర్వే నెంబర్‌ 6లోని 10వ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.

 ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

రామవరప్పాడు(గన్నవరం), మార్చి 4 : ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ పింటు నంది అన్నారు. రామవరప్పాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కొండ పావులూరు సర్వే నెంబర్‌ 6లోని 10వ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కంగారు పడకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వరదలు, భూకంపాలు, మంటలు వ్యాపిం చినప్పుడు ఏ విధంగా అక్కడ ప్రజలను రక్షించాలో మాక్‌ డ్రిల్‌ చేసి, చూపించారు. హెచ్‌ఎం ఎస్‌ఏవి తయారు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:28:31+05:30 IST