స్థాయీసంఘంలో 27 అంశాలకు ఆమోదం

ABN , First Publish Date - 2023-03-19T00:33:39+05:30 IST

నగరపాలక సంస్థ స్థాయీ సంఘం సమావేశంలో 27అంశాలకు ఆమోద ముద్రవేశారు.

స్థాయీసంఘంలో 27 అంశాలకు ఆమోదం
మాట్లాడుతున్న మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి

స్థాయీసంఘంలో 27 అంశాలకు ఆమోదం

చిట్టినగర్‌, మార్చి 18: నగరపాలక సంస్థ స్థాయీ సంఘం సమావేశంలో 27అంశాలకు ఆమోద ముద్రవేశారు. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన శనివారం నగరపాలక సంస్థ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో స్థాయీ సంఘం సమావేశం జరిగింది. సమావేశంలో 32అంశాలపై చర్చించి 27అంశాలను ఆమోదించారు. ఒక అంశం రికార్డు చేయడంతోపాటు 2 అంశాలను వాయిదా వేశారు. ఒక అంశం ర్యాటిపై చేసి పరిపాలన పరమైన అంశాలకు సంబంధించి ఒక అంశాన్ని ధ్రువీకరించారు. నగరపాలక సంస్ధచే శాశ్వతప్రాతిపదికన నడపబడుచున్న మాతా శిశురక్షణ కేంద్రంలో పని చేస్తున్న 14 మంది వైద్య సిబ్బంది కాలపరిమితిని సంవత్సరం కాలం పొడిగిస్తూ స్టాండింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. గాంధీజీ ఇండోర్‌ స్టేడియం వినియోగించి క్రీడాకారులపై భారం పెరిగింది. గతంలో పెద్దలకు నెలవారీ రుసుము రూ. 400 ఉంటే ప్రస్తుతం రూ. 800గా పెరిగింది. విద్యార్థులకు నెలవారీ రుసుం రూ. 200 నుంచి రూ. 400గా పెంచుతూ స్టాండింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. పలు ప్రాంతాల్లో షాపులను మూడేళ్లకు లీజుకు ఇవ్వటానికి, ఉన్న షాపులను రెన్యువల్‌ చేయటానికి సంబంధించిన అంశాన్ని కమిటీ వాయిదా వేసింది. పలువురు కమిటీ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:33:39+05:30 IST