అర్జీలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి: మేయర్
ABN , First Publish Date - 2023-02-21T00:18:06+05:30 IST
స్పందనలో నగర ప్రజల నుంచి వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటిని పరిష్కరించాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు.
అర్జీలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి: మేయర్
చిట్టినగర్, ఫిబ్రవరి 20 : స్పందనలో నగర ప్రజల నుంచి వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటిని పరిష్కరించాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంలో మేయర్ మాట్లాడుతూ స్పందనలో వచ్చే ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. స్పందన లో సోమవారం 9 అర్జీలు వచ్చాయని మేయర్ తెలిపారు. అదనపు కమిషనర్ (జనరల్) ఎం. శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కేవీ సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఎం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి. రత్నావళి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి. వెంకటలక్ష్మి, సిటీ ప్లానర్ జివిజిఎస్‌వి. ప్రసాద్, ప్రాజెక్ట్ ఆఫీసర్ శకుంతల, మేనేజర్ బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.