అంగన్‌వాడీలకు రూ.26 వేలు వేతనమివ్వాలి

ABN , First Publish Date - 2023-03-17T01:01:33+05:30 IST

అంగన్‌ వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకుడు కళ్లం వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

అంగన్‌వాడీలకు రూ.26 వేలు వేతనమివ్వాలి
సీడీపీవో వెంకటలక్ష్మికి వినతిపత్రం అందజేస్తున్న సీఐటీయూ నాయకులు

గన్నవరం, మార్చి 16: అంగన్‌ వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకుడు కళ్లం వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈనెల 20న విజయవాడలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి ధర్నాలో గన్నవరం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని వర్కర్స్‌ అందరూ పాల్గొం టారని సీడీపీవో వెంకటలక్ష్మికి గురు వారం సీఐటీయూ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్‌ రెడ్డి అంగన్‌వాడీ వర్కర్ల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని వెంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణలో కంటే అదనపు వేతనం ఇవ్వాలని ముఖ హాజరు విధానాన్ని రద్దు చేయాలని, ప్రతి నెల 5వ తేదీకే వేతనాలు చెల్లించాలని, 2017నుంచి రావాల్సిన టీఏ బిల్లులు చెల్లించాలని, విజిట్ల పేరుతో వేధింపులు ఆపాలని, 300 జనాభా దాటిన మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా మార్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. నాయకులు పిల్లి మహేష్‌, శివలీల, కనకదుర్గ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-17T01:01:33+05:30 IST