Share News

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:20 AM

అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరిం చకుండా కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం సహేతుమైన చర్య కాదని, వారి సమస్యలను సత్వ రం పరిష్కరించాలని సీపీఎం నాయకుడు బర్రె లెనిన్‌ అన్నారు. బండారుగూడెం సచివాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరుతూ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ జ్యోతికి ఆదివారం వినతిపత్రం అంద జేశారు.

 అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
కంకిపాడులో అంగన్వాడీల దీక్షకు మద్దతు తెలుపుతున్న టీడీపీ నేత సంగెపు రంగారావు

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, డిసెంబరు 17 : అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరిం చకుండా కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం సహేతుమైన చర్య కాదని, వారి సమస్యలను సత్వ రం పరిష్కరించాలని సీపీఎం నాయకుడు బర్రె లెనిన్‌ అన్నారు. బండారుగూడెం సచివాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరుతూ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ జ్యోతికి ఆదివారం వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు అంగన్‌వాడీలను కించప రచేలా మాట్లాడటం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్చలు జరిపి, తల్లి, పిల్లలకు పౌష్టికాహాం అందించేందుకు చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు.

కంకిపాడు : అంగన్వాడీలకు మద్దతుగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు సెంగెపు రం గారావు అన్నారు. శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక దీక్షకు టీడీపీ బీసీ సెల్‌ ఆదివారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న దీక్షకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాల్సిన అవసరముందన్నారు. అంగన్వాడీల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్క రించేంత వరకు ప్రతి ఒక్కరూ అంగన్వాడీలకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:20 AM