సీడీపీవోకు అంగన్‌వాడీ సిబ్బంది సమ్మె నోటీసు

ABN , First Publish Date - 2023-09-22T00:42:42+05:30 IST

అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 25న విజయవాడలో తలపెట్టిన సమ్మెలో పాల్గొంటున్నట్లు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని వర్కర్లు ప్రకటించారు.

సీడీపీవోకు అంగన్‌వాడీ సిబ్బంది సమ్మె నోటీసు
సమ్మె నోటీసు అందజేస్తున్న నాయకులు

తిరువూరు, సెప్టెంబరు 21: అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 25న విజయవాడలో తలపెట్టిన సమ్మెలో పాల్గొంటున్నట్లు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని వర్కర్లు ప్రకటించారు. గురువారం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో విజయవాడ సమ్మెలో పాల్గొంటున్నామని విధులకు హాజరు కామని సీడీపీవో సత్యవతికి ముందస్తుగా తెలుపుతూ నోటీసు అందించారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రతినిధులు నాగమణి, వెంకటేశ్వరమ్మ, ఈశ్వరి పద్మ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:42:42+05:30 IST