జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి

ABN , First Publish Date - 2023-02-07T01:17:09+05:30 IST

నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 84, 85, 117 జీవోల ను రద్దు చేసి ఉపాధ్యాయుల క్రమబద్దీకరణను నిలిపివేయాలని విద్యా ర్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6 : నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 84, 85, 117 జీవోల ను రద్దు చేసి ఉపాధ్యాయుల క్రమబద్దీకరణను నిలిపివేయాలని విద్యా ర్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. అఖిల భారత విద్యా హక్కు వే దిక పిలుపులో భాగంగా సోమవారం ఏఐఎ్‌సఎఫ్‌, పీడీఎ్‌సయూ సం ఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎ్‌సఎఫ్‌ నగర కార్యదర్శి ఎం.సాయికుమార్‌, పీడీఎ్‌స యూ నగరాధ్యక్షుడు ఐ రాజేష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని కాషాయికరించే య త్నాలు తీవ్రతరం చేసిందన్నారు. రాష్ట్రంలో జగన్‌ సర్కారు నూతన వి ద్యా విధానం అమలు చేస్తోందని, 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాల ల్లో విలీనం చేయడం ద్వారా బాలబాలికలు ప్రభుత్వ విద్యకు దూరమవుతున్నారన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర ప్రసాద్‌, ఏఐఎ్‌సఎఫ్‌ న గర ఉపాధ్యక్షుడు బి. సుధీర్‌, సహాయ కార్యదర్శి ఎ. చందు, నేతలు అ య్యప్ప, జగదీష్‌, అభిషేక్‌, రంజిత్‌, సాయి, నాగేంద్ర, శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

టిడ్కో ఇళ్లివ్వాలని సీపీఐ నిరసన ప్రదర్శన

గత ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని, ప్రస్తుత ప్రభుత్వం కేటాయించిన జగనన్న ఇంటి స్థలాన్ని లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు అన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సీహెచ్‌ కోటేశ్వరరావు మాట్లాడుతూ జగన్‌ ప్ర భుత్వం ఇచ్చిన ఇంటిస్థలం ఎక్కడఉందో కనీసం లబ్ధిదారులకు తెలియ ని పరిస్థితి ఉందన్నారు. వారి స్థలాలను వారికి అందజేసి, నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన రూ.1,80,000ను రూ.5 లక్షలకు పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ దిల్లీరావుకు వినతిపత్రం అం దజేశారు. సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పి.దుర్గాభవాని, పార్టీ సహాయ కార్యదర్శి లంక దుర్గారావు, ఏఐటీయూసీ రాష్ట్ర నేత వెంకటసుబ్బయ్య, నగర కార్యదర్శి వర్గ సభ్యులు బుట్టి రాయప్ప, మూలి సాంబశివరావు, కేవీ భాస్కరరావు, పంచదార్ల దుర్గాంబ, కొట్టు రమణరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:17:10+05:30 IST