నగరంలో నటి అవికాగోర్‌ సందడి

ABN , First Publish Date - 2023-02-02T01:01:57+05:30 IST

చిన్నారి పెళ్లికూతురు ఫేమ్‌ నటి అవికాగోర్‌ నగరంలో బుధవారం సందడి చేసింది. ఆమె నటించిన ‘పాప్‌కార్న్‌’ చిత్రం ఈనెల 10న విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా గాంధీనగర్‌ లోని ఓ హోటల్‌లో చిత్రయూనిట్‌ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది.

నగరంలో నటి అవికాగోర్‌ సందడి
పాప్‌కార్న్‌ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో మాట్లాడుతున్న నటి అవికాగోర్‌

ధర్నాచౌక్‌, ఫిబ్రవరి 1: చిన్నారి పెళ్లికూతురు ఫేమ్‌ నటి అవికాగోర్‌ నగరంలో బుధవారం సందడి చేసింది. ఆమె నటించిన ‘పాప్‌కార్న్‌’ చిత్రం ఈనెల 10న విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా గాంధీనగర్‌ లోని ఓ హోటల్‌లో చిత్రయూనిట్‌ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ చిత్రం పై నమ్మకంతో సహ నిర్మాతగా తాను వ్యవహరించానని అవికాగోర్‌ తెలి పారు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన యువతి, యువకుడి మధ్య సన్నివేశాలతో ఈ చిత్రం తెరకెక్కించినట్టు చెప్పారు. ఇప్పటికే సినిమా ట్రైలర్‌, పాటలకు విశేష స్పందన వచ్చిందని, సినిమా విజయవంతం అవుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. గతంలో తాను నాలుగు చిత్రాల్లో నటించానని తొలి సారిగా సీనియర్‌ నటి అవికాగోర్‌తో నటించడం సంతోషంగా ఉందని హీరో సాయిరోనక్‌ తెలిపారు. చిత్ర దర్శకుడు మురళీ మాట్లాడుతూ అనేక యాడ్‌ ఫిల్మ్‌లు తీసిన తాను మొదటిసారి పాప్‌కార్న్‌ చిత్రానికి దర్శకత్వం వహించానన్నారు. సహనిర్మాత చలపతిరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T01:01:58+05:30 IST