Share News

బందరు పోర్టు పనులు వేగవంతం

ABN , Publish Date - Dec 29 , 2023 | 01:22 AM

బందరుపోర్టు పనులు వేగవంతంగా చేస్తున్నట్టు ఎమ్మెల్యే పేర్నినాని తెలిపారు. పోర్టు నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, కృష్ణాజిల్లా అభివృద్ధి బందరుపోర్టు ద్వారానే సాధ్యమన్నారు. ఓడల రాకపోకల నిమిత్తం నాలుగుబెర్తులను నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు.

బందరు పోర్టు పనులు వేగవంతం
పోర్టు పనులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పేర్ని నాని

మచిలీపట్నం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : బందరుపోర్టు పనులు వేగవంతంగా చేస్తున్నట్టు ఎమ్మెల్యే పేర్నినాని తెలిపారు. పోర్టు నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, కృష్ణాజిల్లా అభివృద్ధి బందరుపోర్టు ద్వారానే సాధ్యమన్నారు. ఓడల రాకపోకల నిమిత్తం నాలుగుబెర్తులను నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరునాటికి పూర్తిస్థాయిలో మొదటి బెర్తు పిల్లర్ల పనులు పూర్తిచేసి, జూన్‌ నెలాఖరు నాటికి పిల్లర్లపై బీమ్‌లు, శ్లాబ్‌ వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సౌత్‌ బ్రేక్‌వాటర్‌ నిర్మాణం 2050మీటర్లమేర జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 1400 మీటర్ల పనులు జరిగాయన్నారు. ఫిబ్రవరి నెలాఖరునాటికి సౌత్‌బ్రేక్‌ వాటర్‌ పనులు పూర్తి చేయనున్నట్టు చెప్పారు. 30 నెలల్లో పోర్టు పనులు పూర్తిచేయాల్సి ఉండగా 24 నెలల్లోనే పనులు చేసేందుకు కృషిచేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Dec 29 , 2023 | 01:22 AM