శుభకార్యానికి వచ్చిన వివాహిత విద్యుదాఘాతంతో మృతి

ABN , First Publish Date - 2023-05-27T01:53:39+05:30 IST

బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చి విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందగా, మరో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి.

శుభకార్యానికి వచ్చిన వివాహిత విద్యుదాఘాతంతో మృతి

మరో ముగ్గురు మహిళలకు గాయాలు

పెనమలూరు, మే 26: బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చి విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందగా, మరో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. శుక్రవారం ఈ ఘటన గోసాలలో జరిగింది. గాయపడిన మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గోసాల వంతెన పక్క వీఽధిలో నివాసముంటున్న మున్నంగి వెంకటేశ్వరరావు ఇంటిలో శుభకార్యానికి బంఽధువైన వేమూరి దుర్గ, తన ఇద్దరు కుమార్తెలు వరూష, అనూషతో వచ్చారు. వరూష విశాఖపట్నం నుంచి రాగా అనూష ఉయ్యూరు మండలం చిన ఓగిరాల నుంచి వచ్చారు. అయితే ఇంట్లో సింక్‌ పనిచేయడం లేదని వెంకటేశ్వరరావు భార్య సుమిత్రాదేవి, వేమూరి దుర్గ, వరూష, అనూష ఇనుప చువ్వతో బాగుచేయడానికి ప్రయత్నిస్తుండగా ఇంటి పక్కనే ఉన్న విద్యుత్‌ తీగలకు చువ్వ తగిలి నలుగురికీ షాక్‌ తగిలింది. వీరిలో అనూష అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురూ తీవ్ర గాయాలతో విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వరూష గర్భిణి. ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-05-27T01:53:39+05:30 IST