Share News

భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి రూ.10.20లక్షలు అందజేత

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:42 AM

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని సీపీఎం నాయకుడు సీహెచ్‌ బాబూరావు విమర్శించారు.

భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి  రూ.10.20లక్షలు అందజేత

భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి రూ.10.20లక్షలు అందజేత

సత్యనారాయణపురం, డిసెంబరు 22: రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని సీపీఎం నాయకుడు సీహెచ్‌ బాబూరావు విమర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు భవనంపైనుంచి కిందపడి మంచాన పడిన రమణ కుటుంబానికి రూ.10.20లక్షలు ఆయన శుక్రవారం అందజేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఐటీయూ అనుబంధ సంస్థ బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్మిక కుటుంబానికి అండగా నిలిచి పోరాడిందన్నారు. గాయపడిన మీసాల కుటుంబానికి రూ.10.20లక్షలు ఇచ్చేందుకు భవన యజయమాని, మేస్త్రీ అంగీకరించడంతో శుక్రవారం సిహెచ్‌ బాబూరావు కుటుంబ సభ్యులకు అందజేశారు. అధికారులు, ఎమ్మెల్యే స్పందించి రమణకు గృహం మంజూరు చేయాలని, ఆర్థిక సాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమనిధి, పథకాలను ప్రభుత్వం పునరుద్ధరించే వరకూ కార్మికుల పోరాటానికి సీపీఎం అండగా నిలుస్తుందన్నారు. సీఐటీయూ సెంట్రల్‌ సిటీ అధ్యక్షుడు కె.దుర్గారావు, సీఐటీయూ నాయకులు బి. గోవిందు, ఎం.బాబూరావు, శ్రీనివాస్‌, సత్యనారాయణ, జి.గోవిందు, హరిబాబు, కృష్ణమూర్తి, ఆశా పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:42 AM