Kimidi Nagarjuna : మొద్దు శ్రీను పరిస్థితే కోడికత్తి శ్రీనుకి కూడా వస్తే..?
ABN , First Publish Date - 2023-09-01T13:25:30+05:30 IST
కోడి కత్తి కేసుపై వైసీపీ నేతలు మాటలపై టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిమిడి నాగార్జున మాట్లాడుతూ.. టీడీపీ తనపై కుట్ర చేస్తోందని చిన్న శ్రీను మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
విజయనగరం : కోడి కత్తి కేసుపై వైసీపీ నేతలు మాటలపై టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిమిడి నాగార్జున మాట్లాడుతూ.. టీడీపీ తనపై కుట్ర చేస్తోందని చిన్న శ్రీను మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాట్లాడిన లాయర్ గురించి మాట్లాడడం మానేసి టీడీపీని ఇందులోకి లాగడం ఏంటని ప్రశ్నించారు. నాలుగు ఏళ్ళుగా నిందితుడు శ్రీనుకి ఎన్ఓసీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. దళిత యువకుడు నాలుగు ఏళ్ళుగా జైల్లో మగ్గిపోతున్నాడని కిమిడి నాగార్జు అన్నారు.
‘‘జగన్, అవినాష్ మాత్రం బెయిల్ మీద తిరుగుతున్నారు. బాబాయి ని ఎవరు హత్య చేశారో కూడా ప్రజలు అందరికి తెలుసు. కోడి కత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకి రావడం లేదు? కోడి కత్తి డ్రామా ఆడింది వైసీపీ. ఈ డ్రామా అంతా టీడీపీ మీద నెట్టి మీరు అధికారం లోకి వచ్చారు అనే సంగతి అందరికీ తెలుసు. నిందుతుడు శ్రీను కి జైల్లో ప్రాణ హాని ఉంది అని మాకు అనుమానంగా ఉంది. గతంలో మొద్దు శ్రీను కూడా జైల్లో హత్యకు గురయ్యాడు. అదే విదంగా శ్రీనుకి అలా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
మీ ఎమ్మెల్సీ దళిత యువకుడిని చంపి జైల్లోకి వెళ్లి బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. దళితుడు కాబట్టే శ్రీను కి బెయిల్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. దళితులు అంటే వైసీపీకి చిన్న చూపు. మీరు కుట్రలు చేసి ప్రతి విషయాన్ని టీడీపీ మీదకి నెట్టి లబ్ది పొందాలని చూస్తున్నారు. మీ పాలన మీద ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు. చిన్న శ్రీను ఇలాంటి మాటలు మాట్లాడడం మానుకోవాలి. మీ ప్రతిష్ట కి భంగం కల్గించాల్సిన అవసరం మాకు లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అన్ని సీట్లు మేమే గెలుస్తాం’’ అని కిమిడి నాగార్జు అన్నారు.