AP Cabinet decisions: భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ, లంక భూములు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ABN , First Publish Date - 2023-07-12T17:43:44+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం (AP Cabinet meet) ముగిసింది. పలు కీలక అంశాలకు సంబంధించిన పనులను ప్రారంభించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

AP Cabinet decisions: భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ, లంక భూములు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీ కేబినెట్ ఫైల్ ఫొటో

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం (AP Cabinet meet) ముగిసింది. పలు కీలక అంశాలకు సంబంధించిన పనులను ప్రారంభించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


కీలక నిర్ణయాలు ఇవే...

  • సీఆర్డీఏలోని అర్-5 జోన్‌లో 47 వేల 17 ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం.

  • ఈ నెల 24న సీఆర్డీయే ప్రాంతంలో 47 వేల 17 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం.

  • శ్రీకాకుళం జిల్లా భావన పాడు -మూలపేట పోర్టు నిర్మాణం కోసం రూ. 3,880 కోట్లు రుణం.

  • పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకునేందుకు కేబినెట్ అనుమతి.

  • భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ, లంక భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం.

  • అన్నమయ్య జిల్లా వేంపల్లి వద్ద జిందాల్ న్యూ ఎనర్జీకి 1500 మెగావాట్ల పంపెడ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆమోదం.

  • టిడ్కో కాలనీల్లోని 260 ఎకరాలను విక్రయించడంతో పాటు హడ్కో నుంచి 750 కోట్లు రుణం తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.

  • గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 454 కోట్ల పరిహార ప్యాకేజీ మంజూరుకు కేబినెట్ ఆమోదం.

  • రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం.


ఈ నెలలో చేపట్టనున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు కేబినెట్‌ ఆమోదం.

  • ఈ నెల 18న జగనన్నతోడుకు క్యాబినెట్ ఆమోదం

  • ఈ నెల 21న నేతన్న నేస్తం కింద లబ్ధిదారులకు నిధులు జమ.

  • ఈ నెల 26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు నిధులు జమ

  • ఈ నెల 28న జగనన్న విదేశీ విద్యాదీవెన కింద నిధులు జమ.

  • 63,191.84 ఎకరాల అసైన్డ్‌ ల్యాండ్స్‌,లంక భూములపై 66,111 మందికి పూర్తి హక్కులు కలిగించేలా నిర్ణయం.

  • భూమి పొందిన వ్యక్తి 20 ఏళ్లు అనుభవం పొందిన తర్వాత పూర్తి హక్కులు.

  • 1700 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మసాన వాటికలు ఏర్పాటుకు నిర్ణయం.

  • రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్‌ పర్చేజ్‌ స్కీం కింద దళితులకు ఇచ్చిన 14,213 ఎకరాలకు రుణాలు మాఫీ.

  • కుల వృత్తులు చేసుకునేవారికి ఇచ్చిన ఇనామ్‌ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగింపునకు ఆమోదం.

  • దీనిద్వారా 1.13 లక్షలమంది బీసీలకు ఉపయోగం

  • టోఫెల్‌ పరీక్షల కోసం ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ కోసం ఈటీఎస్‌తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం.

  • అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేకుండా చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం.

  • దేవాదాయశాఖ ఉద్యోగులకు రిటైర్మంట్‌ వయసు 62 ఏళ్లకు పెంపు.

  • విశాఖ భూముల అక్రమాలకు సంబంధించిన సిట్‌ రిపోర్టుకు కేబినెట్‌ ఆమోదం.

  • ఈ నెల 28న జగనన్న విదేశీ విద్య ద్వారా 400 మంది విద్యార్ధులకు సాయం.

  • ప్రతి నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ది కళాశాలలకు కేబినెట్ ఆమోదం.

  • తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్‌లో 11 పోస్టులు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.

  • 13 కొత్త జిల్లాల్లో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయం.

  • ఎన్‌హెచ్‌ఆర్సీకి 9 పోస్టులు మంజూరు చేస్తూ ఆమోదం

  • అసైన్డ్ భూమి కొనుగోలు చెల్లదు.... కోనుగోలు చేసిన వ్యక్తికి హక్కు ఉండదు.

  • జూలై నెలలో చేపట్టే సంక్షేమ పథకాలు అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

  • ఏపీ లోని కొత్త 5 మెడికల్ కళాశాల ల్లో 706 పోస్టులు, బోధనా కోసం 480 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.


  • అన్నమయ్య జిల్లా గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు 482 కోట్లు ఆమోదం.

  • పోలవరం ప్రాజెక్టు పునరావాసం కోసం ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు, పోస్టుల భర్తీకి నిర్ణయం.

  • 8104 కోట్ల పెట్టుబడి తో జిందాల్ న్యూ ఎనర్జీ ప్లాంట్ 1500 మెగావాట్ల సామర్థ్యంతో పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టు.

  • రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి లో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం.

  • మూల పేట పోర్టు నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ బోర్డు రూ. 3884 కోట్ల రుణాలు తీసుకునేందుకు అనుమతి.

ప్రభుత్వ అధీనంలోనీ దేవాలయాల్లో అర్చకులకు ఉద్యోగ విరమణ లేకుండా చట్ట సవరణకు మంత్రి మండలి ఆమోదం.

Updated Date - 2023-07-12T18:08:56+05:30 IST