వైవీయూ పీజీ మూడో సెమిస్టరు ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2023-07-24T23:08:13+05:30 IST
పీజీ మూడో సెమిస్టరు ఫలితాలను యూనివర్సిటీ లోని వీసీ చాంబరులో సోమవారం వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ చింతా సుధాకర్, రిజిసా్ట్రర్ వైపీ వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ ఈశ్వర్‌రెడ్డి విడుదల చేశారు.
కడప (ఎడ్యుకేషన్), జూలై 24 : పీజీ మూడో సెమిస్టరు ఫలితాలను యూనివర్సిటీ లోని వీసీ చాంబరులో సోమవారం వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ చింతా సుధాకర్, రిజిసా్ట్రర్ వైపీ వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ ఈశ్వర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ ఏడాది మార్చిలో ఈ పరీక్షలు నిర్వహించామన్నారు. ఎంసీఏ 97.92 శాతం, ఎంఎ్‌ససీ వృక్షశాస్త్రం 100 శాతం, బయోకెమిసీ్ట్ర 100 శాతం, రసాయనిక శాస్త్రం 82.87 శాతం, బయాలజీ 100 శాతం, మేథమేటిక్స్ 73.33, మైక్రోబయాలజీ 100 శాతం, భౌతికశాస్త్రం 90.32 శాతం, బయోటెక్నాలజీ 100 శాతం, కంప్యూటర్ సైన్స్ 89.13 శాతం, జంతు శాస్త్రం 93.75శాతం, పర్యావరణ శాస్త్రం 100శతం, జెనెటిక్స్ అండ్ జెనోటిక్‌లో 100శాతం, నానోటెక్నాలజీ 100 శాతం, సైకాలజీలో 100 శాతం, ఫుడ్ టెక్నాలజీలో 100 శాతం, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 100 శాతం, ఫైన్‌ఆర్ట్స్ ఏడాది వ్యవధి గల కోర్సులో100శాతం ఫలితాలు సాధించారన్నారు. ఉత ్తమ ఫలితాలు సాధించిన కళాశాలల్లో అధ్యాపకులను విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ విభాగం సహాయ అఽధికారి డాక ్టర్ సుమిత్ర పాల్గొన్నారు.