రేపటి నుంచి యోగా బ్యాచ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2023-03-30T23:32:17+05:30 IST

కడప నగ రం పటేల్‌రోడ్డు వద్ద గల మిత్ర యోగా సెం టరులో ఏప్రిల్‌ 1 నుంచి 30 రోజుల పాటు నిర్వహించనున్న యోగా శిక్షణ కొత్త బ్యాచ్‌ను ప్రారంభించనున్నట్లు యోగానిపుణుడు డాక్టర్‌ కె.కల్పన, రంగనాథరెడ్డి తెలిపారు.

రేపటి నుంచి యోగా బ్యాచ్‌ ప్రారంభం

కడప (ఎర్రముక్కపల్లె), మార్చి 30 : కడప నగ రం పటేల్‌రోడ్డు వద్ద గల మిత్ర యోగా సెం టరులో ఏప్రిల్‌ 1 నుంచి 30 రోజుల పాటు నిర్వహించనున్న యోగా శిక్షణ కొత్త బ్యాచ్‌ను ప్రారంభించనున్నట్లు యోగానిపుణుడు డాక్టర్‌ కె.కల్పన, రంగనాథరెడ్డి తెలిపారు. శిక్షణలో రోగనిరోధక శక్తి ని పెంచుకోవడానికి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి, అధిక బీపీ, డయాబెటిస్‌, ఓబెసిటీ తదితర దీర్ఘకాలిక సమస్యల నివారణకు ఊపిరితిత్తుల సామర్ధ్యం పెంచుకోవడానికి అవసరమైన యోగాసనాలు, ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, ధ్యానం తదితర యోగా ప్రక్రియలను శాస్త్రీయంగా సాధన చేస్తామన్నారు. శిక్షణ ఉదయం 5.30 నుంచి 7 వరకు మొదటి బ్యాచ్‌, తదుపరి ఉదయం 10.30 నుంచి 11.45 వరకు మహిళలకు రెండో బ్యాచ్‌ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 9848861206 నెంబరును సంప్రదించాలన్నారు.

Updated Date - 2023-03-30T23:32:17+05:30 IST