టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

ABN , First Publish Date - 2023-05-18T22:53:24+05:30 IST

పీలేరు మండలం జాండ్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బాబ్జిరెడ్డి, అనిల్‌ రెడ్డి, సిద్దారెడ్డి, రవి నాయక్‌, దేవేంద్రతో పాటు మరికొంత మంది గురువారం టీడీపీలో చేరారు.

టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు
టీడీపీలో చేరిన వారితో నల్లారి కిశోర్‌, స్థానిక నాయకులు

పీలేరు, మే 18: పీలేరు మండలం జాండ్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బాబ్జిరెడ్డి, అనిల్‌ రెడ్డి, సిద్దారెడ్డి, రవి నాయక్‌, దేవేంద్రతో పాటు మరికొంత మంది గురువారం టీడీపీలో చేరారు. వారందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు రాష్ట్ర, నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలి కేవలం టీడీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, టీడీపీ కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. వైసీపీ నాయకుల ఆగడాలకు విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు తమ అధినేత చంద్రబాబునాయుడు, యువ నాయకుడు నారా లోకేశ్‌ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎండల్లా మండిపోతున్నా వాటిని అదుపు చేయడంలో ప్రభుత్వ పెద్దలు విఫలమయ్యారన్నారు. పార్టీలోకి వస్తున్న వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటాయని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటపల్లె బాబురెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, అమరనాథరెడ్డి, పురం రామ్మూర్తి, మల్లెల రెడ్డిబాషా, కంచి సూరి, పసుపులేటి లక్ష్మీకర, రెడ్డప్పరెడ్డి, మల్లి, రెడ్డమ్మ, కె.శ్రీనాథరెడ్డి, రాజా, జయన్న, అప్పస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-18T22:53:24+05:30 IST