ప్రభుత్వ భూ ఆక్రమణలో వైసీపీ నేతలు
ABN , First Publish Date - 2023-09-19T23:05:39+05:30 IST
బండపల్లె పంచాయతీ పరిధి అభయహస్త ఆంజనే యస్వామి దేవాలయం సమీప సర్వే నెంబర్ 327 లో సుమారు పదెకరాలకు పైగా ప్రభుత్వ భూమిని బండపల్లె వద్ద కొందరు వైసీపీ నేతలు రాజకీయ నే తల అండదండలతో ఆక్ర మిస్తున్నారు.

రామాపురం, సెప్టెంబరు19: బండపల్లె పంచాయతీ పరిధి అభయహస్త ఆంజనే యస్వామి దేవాలయం సమీప సర్వే నెంబర్ 327 లో సుమారు పదెకరాలకు పైగా ప్రభుత్వ భూమిని బండపల్లె వద్ద కొందరు వైసీపీ నేతలు రాజకీయ నే తల అండదండలతో ఆక్ర మిస్తున్నారు. గతంలో ఈ భూమిని గోశాలకు కావాలని తిరుమల, తిరుపతి దేవస్థానా నికి ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి అనుమతులు రాలేదు. గతంలోనే నాలుగు గ్రామా లు సరిహద్దు గ్రామ ప్రజలు ఈ భూమి దేవస్థాన గోశాలకు అవసరమని తహసీ ల్దార్‌కు చెప్పారని అంటున్నారు. గతంలోనే ఈ భూమిలో తహసీల్దార్ సూచికబోర్డును ఏర్పాటు చేశారు.
ఎవరైనా అనుమతి లేనిది ఏమీ చేయకూడదని బోర్డు ఏర్పాటు చేశా రు. అయితే ప్రభుత్వ అధికారుల ఉత్తర్వులను పక్కనపెట్టి వైసీపీ నేతలు అక్రమంగా హిటాచీలతో గుట్టలను సదరం చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆక్రమణ గురించి పలు గ్రామాల ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ అరవింద కుమార్‌ను వివరణ కోరగా ప్రభుత్వ భూములు ఎవరైనా గానీ అనుమతులు లేనిదే ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరణ ఇచ్చారు.