YCP: మహిళా ఎస్ఐపై ఇసుకాసురుల దాడి వెనుక వైసీపీ శ్రేణుల హస్తం?
ABN , First Publish Date - 2023-12-11T10:06:50+05:30 IST
సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకాలో పోలీస్ అధికారులపై వరుస దాడులు జరుతున్నాయి. దీని వెనుక వైసీపీ నేతల హస్తముందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడపలో ఇంటెలిజెన్స్ సీఐ అనిల్ కుమార్‌పై వైసీపీ శ్రేణుల ప్రోద్బలంతోనే బీహార్, ఒరిస్సా యువకులు దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
కడప: సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకాలో పోలీస్ అధికారులపై వరుస దాడులు జరుతున్నాయి. దీని వెనుక వైసీపీ నేతల హస్తముందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడపలో ఇంటెలిజెన్స్ సీఐ అనిల్ కుమార్‌పై వైసీపీ శ్రేణుల ప్రోద్బలంతోనే బీహార్, ఒరిస్సా యువకులు దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రొద్దుటూరులో మహిళా ఎస్ఐపై ఇసుకాసురుల దాడి వెనుక వైసీపీ శ్రేణుల హస్తమున్నట్టు తెలుస్తోంది. కడపలో ఇంటెలిజన్స్ సీఐ అనిల్ కుమార్‌పై బీహార్, ఒరిస్సా యువకుల దాడి ఘటనపై కేసు నమోదు చేయకుండావైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. కడపలో పోలీసులపై దాడులు జరుగుతున్నా.. పోలీసు అధికారులు లైట్ తీసుకోవడంపై జనంలో చర్చనీయాంశంగా మారింది.