అవినీతి పునాదులపై వెలసిన పార్టీ వైసీపీ

ABN , First Publish Date - 2023-03-05T22:59:23+05:30 IST

అవినీతి పునాదులపై వెలసిన పార్టీ వైసీపీ అని, ఆ పార్టీ వారు మరొకరిని విమర్శించడం విడ్డూరంగా ఉందని తె లుగు యువత జిల్లా అధ్యక్షుడు పుత్తా యల్లారెడ్డి, కమలాపురం నియోజకవర్గం రైతు సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.

అవినీతి పునాదులపై వెలసిన పార్టీ వైసీపీ
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

టీడీపీ నాయకుల ధ్వజం

కమలాపురం రూరల్‌, మార్చి 5 : అవినీతి పునాదులపై వెలసిన పార్టీ వైసీపీ అని, ఆ పార్టీ వారు మరొకరిని విమర్శించడం విడ్డూరంగా ఉందని తె లుగు యువత జిల్లా అధ్యక్షుడు పుత్తా యల్లారెడ్డి, కమలాపురం నియోజకవర్గం రైతు సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ అవినీతి పునాదులై వెలసిన వైసీపీకి కూల్చడం తప్ప కట్టడం చేతకాదన్నారు. సీఎం జగన్‌ మేనమామ, ఆయన కుమారుడు గత రెండురోజుల క్రితం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ యువగళంలో నారా లోకేశ చేపట్టిన పాదయాత్ర హా స్యాస్పదమని పేర్కొన్నారని, మరి అలాంటప్పుడు లోకేశ పాదయాత్రకు పోలీసులు ఎందుకు అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారని ప్రశ్నించారు. ప్రచార రథాన్ని ఎందుకు స్వాధీనం చేసుకున్నారన్నారు. మైకు పర్మిషన్‌ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే ఎవరు పిరికివారో అర్థం అవుతోందన్నారు.కమలాపురం ఎమ్మెల్యే రవిరెడ్డి కుమారుడు అవగాహనా రాహిత్యంగా మాట్లాడటం తగదన్నారు. ఎమ్మెల్యే ఎంత మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారో ఆయన కుమారుడు సమాధానం చెప్పాలన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్‌ అధికారంలోకి రాగానే రెండు లక్షలా 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నేటికీ ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు భర్తీ చేశారో నిరుద్యోగులకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కేంద్రం మెడలు వంచి తెస్తామన్న ప్రత్యేక హోదా ఏమైందో నిరుద్యోగులకు చెప్పాలన్నారు. ఉద్యోగాలు లేక, పరిశ్రమలు రాక చదువుకుని ఖాళీగా ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుద్యోగుల క డుపు మండుతోందన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు ఇలా అన్నివర్గాలను జగన్‌ మోసం చేశారన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, ఆయన కుమారుడు నిరుద్యోగులకు న్యా యం చేయాలని, లేదంటే కమలాపురం నిరుద్యోగ యువత ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని హెచ్చరించారు. మండల టీడీపీ నాయకులు బోయిళ్ల శివశంకర్‌రెడ్డి, శంకర్‌యాదవ్‌, ప్రసాద్‌రెడ్డి, బాలిరెడ్డి, బిరు రవిశంకర్‌, సుబ్బారెడ్డి, ఐటీడీపీ నరసింహ, నాగేంద్ర యాదవ్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T22:59:23+05:30 IST