మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

ABN , First Publish Date - 2023-01-25T00:00:43+05:30 IST

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రముఖ క్రీడాకారిణి మంజులారెడ్డి, సినీ నటి రమాప్రభ పేర్కొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
మాట్లాడుతున్న సినీనటి రమాప్రభ, క్రీడాకారిణి

మదనపల్లె టౌన, జనవరి 24: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రముఖ క్రీడాకారిణి మంజులారెడ్డి, సినీ నటి రమాప్రభ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక బైపాస్‌రోడ్డులోని ప్రైవేటు ఫం క్షనహాల్లో ఎఫ్‌ఈఎస్‌ సంస్థ ఆధ్వర్యంలో 15 మండ లాలకు చెందిన మహిళా సర్పంచలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఈఎస్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ రాణి మాట్లాడుతూ గ్రామాల్లో మహిళా సర్పంచలు గ్రామ పరిధిలో వున్న ఉమ్మడి వనరులైన కొండలు, గుట్టలను క్వారీలకు ఇవ్వకుండా భవిష్యత తరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డివిజనలోని 15 మండలాల నుంచి మహి ళా సర్పంచలు, మదనపల్లె ఎఫ్‌ఈఎస్‌ ఇనచార్జి హసీనా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:00:43+05:30 IST