రైతులకు ఉపయోగపడని ఆర్‌బీకేలు ఎందుకు?

ABN , First Publish Date - 2023-01-25T23:56:45+05:30 IST

రైతులకు ఉపయోగపడని ఆర్‌బీకేలు ఎందుకు అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

రైతులకు ఉపయోగపడని ఆర్‌బీకేలు ఎందుకు?

చెన్నూరు, జనవరి 25: రైతులకు ఉపయోగపడని ఆర్‌బీకేలు ఎందుకు అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. చెన్నూరులోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గుమ్మళ్ల మల్లిఖార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది కాంట్రాక్టర్ల కోసమేనన్నారు. అసలు ఎరువులే నిల్వ ఉంచలేనప్పుడు ఈ ఆర్‌బీకేలు ఎందుకన్నారు. సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందో అర్థమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు కార్యదర్శి ఆర్‌.సుధాకర్‌రెడ్డి, తెలుగు రైతు మం డల అధ్యక్షుడు బాలక్రిష్ణారెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ మైనార్టీ కార్యదర్శి ఖాజాహుసేన్‌, జిల్లా మైనార్టీ నేత షబ్బీర్‌ హుసేన్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు ఆటోబాబు, కనుపర్తి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:56:45+05:30 IST