డీఏలకు మోక్షం ఎప్పుడు: యూటీఎఫ్
ABN , First Publish Date - 2023-03-19T23:34:23+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగులో ఉన్న డీఏలను ఎప్పుడు చెల్లిస్తారో తెలపాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహే్‌షబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కడప (ఎడ్యుకేషన), మార్చి 19 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగులో ఉన్న డీఏలను ఎప్పుడు చెల్లిస్తారో తెలపాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహే్‌షబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగులో ఉన్నా ఒక్క డీఏ కూడా చెల్లించకపోవడం దా రుణమన్నారు. ఉగాది పండగను పురస్కరించుకుని అయినా పెండింగులో ఉన్న డీఏలను అన్నింటినీ విడుదల చేయాలని డి మాండ్ చేశారు. యూటీఎఫ్ నాయకులు చెరుకూరి శ్రీనివాసులు, రమణ, ఎజాస్ అహ్మదద్, నరసింహారావు, కరీముల్లా, దేవదానం పాల్గొన్నారు.