Share News

రాబోయేది రైతు సంక్షేమ రాజ్యం

ABN , Publish Date - Dec 30 , 2023 | 11:57 PM

ఎన్నికల తరువాత రాష్ట్రం లో రాబోయేది రైతు సంక్షే మ రాజ్యమేనని, వైసీపీ ఐదేళ్ళ పాలనలో అన్ని విధాల తీవ్రంగా నష్టపో యిన రైతులు కోలుకునే అవకాశమొస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి ఽధీమా వ్యక్తం చేశారు.

రాబోయేది రైతు సంక్షేమ రాజ్యం
బాబు ష్యూరిటీల గురించి వివరిస్తున్న కిశోర్‌కుమార్‌ రెడ్డి

కలికిరి, డిసెంబరు 30: ఎన్నికల తరువాత రాష్ట్రం లో రాబోయేది రైతు సంక్షే మ రాజ్యమేనని, వైసీపీ ఐదేళ్ళ పాలనలో అన్ని విధాల తీవ్రంగా నష్టపో యిన రైతులు కోలుకునే అవకాశమొస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి ఽధీమా వ్యక్తం చేశారు. సీఎం అనాలోచిత నిర్ణయాల ఫలితంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, అదే దారిలో రైతుల పరిస్థితి కూడా తయారైందని విమర్శించారు. బాబు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ప్రచారం కోసం శనివారం రామాపురం, మునేళ్ళపల్లె, సండ్రావారిపల్లె, తొగటపల్లె, కంభంవా రిపల్లె, దూదేకులపల్లె గ్రామాల్లో ఇంటింటి పర్యటన జరిపారు. సర్పంచులు ప్రతాప్‌కుమార్‌ రెడ్డి శశికళ, జాహీదా, టీడీపీ నాయకులు నిజాముద్దీన, చంద్రశేఖర్‌, రమణయ్య, ప్రేమనాథ రెడ్డి, సతీష్‌కుమార్‌ రెడ్డి, మహ్మద్‌ రఫీ, వెంకట్రమణ, దేవేంద్ర, గిరిధర్‌ నాయుడు, కాదర్‌వల్లి, నెల్లిమంద, కృష్ణా రెడ్డి, జ్ఞాన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 11:57 PM