బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాల మాటేమిటి?

ABN , First Publish Date - 2023-08-02T23:51:52+05:30 IST

కేడర్‌ స్ర్టెన్త అప్‌డేషన పేరు తో బదిలీ, పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు రెండు మాసాల నుంచి జీతాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నారు.

బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాల మాటేమిటి?
మాట్లాడుతున్న మాదన విజయకుమార్‌

కడప (ఎర్రముక్కపల్లె), ఆగస్టు 2: కేడర్‌ స్ర్టెన్త అప్‌డేషన పేరు తో బదిలీ, పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు రెండు మాసాల నుంచి జీతాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నారు. జీతాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్‌, పాలెం మహే్‌షబాబు విమర్శించారు. బుధవారం కడప నగరం యూటీఎఫ్‌ భవనలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతి బదిలీ పొందిన ఉపాధ్యాయులకు గత రెండు మాసాలుగా జీతాలు చెల్లించకపోతే

వారు ఎలా జీవించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం విద్యాశాఖ అఽధికారుల నిర్లిప్తత వల్ల గత రెండు మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతి, బదిలీ పొందిన దాదాపు 60వేల మంది ఉపాధ్యాయులకు జీతాలు ఆగిపోయాయన్నారు. రెండు మాసాలుగా జీతాలు రాకపోవడం మూలాన వారి జీవనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. తక్షణం జీతాలు చెల్లించకుంటే ఈ నెల 4న డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యకమ్రంలో జిల్లా కార్యదర్శి రమణ, నాయకులు కిరణ్‌కుమార్‌, శివశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T23:51:52+05:30 IST