వామ్మో... కుక్కలు....

ABN , First Publish Date - 2023-03-25T22:45:40+05:30 IST

ఊర్లో మనుషుల నడుమ తిరుగాడే కుక్కలే మనుషులను వెంటపడుతుండడం, చిన్నపిల్లలపై దాడు లు చేయడం, పెంపుడు జంతువులను చంపి తినేస్తుండడంతో జనం భయంతో బెంబేలెతుతు న్నారు. ఈ దారిన వెళ్లే వాహన దారులు కుక్క ల విషయంలో భయపడి వాహనాన్ని వేగంగా నడిపినా కుక్కలు అంతేవేగంతో వెంబ డిస్తుం టాయి. దీంతో ఏదైనా వాహనం అదుపు తప్పి మరో వాహనం కిందపడే అవకాశంలేక పోలేదు. ఒక వేళ కుక్కలు వెంబడించాయని వాహనాన్ని నిలిపితే కుక్కల దాడి తప్పట్లేదు. వివరాల్లోకెళితే...

వామ్మో... కుక్కలు....
ఖాజీపేట బస్టాండు వద్ద రాత్రి పూట గుంపులుగా ఉన్న కుక్కలు

వీధి కుక్కల స్వైర విహారం

మనుషులను వెంటపడుతున్న వైనం

రావులపల్లెలో నాలుగు దూడలు, నాలుగు పొట్టేళ్ల స్వాహా

బద్వేలు రూరల్‌/ ఖాజీపేట, మార్చి 25: ఊర్లో మనుషుల నడుమ తిరుగాడే కుక్కలే మనుషులను వెంటపడుతుండడం, చిన్నపిల్లలపై దాడు లు చేయడం, పెంపుడు జంతువులను చంపి తినేస్తుండడంతో జనం భయంతో బెంబేలెతుతు న్నారు. ఈ దారిన వెళ్లే వాహన దారులు కుక్క ల విషయంలో భయపడి వాహనాన్ని వేగంగా నడిపినా కుక్కలు అంతేవేగంతో వెంబ డిస్తుం టాయి. దీంతో ఏదైనా వాహనం అదుపు తప్పి మరో వాహనం కిందపడే అవకాశంలేక పోలేదు. ఒక వేళ కుక్కలు వెంబడించాయని వాహనాన్ని నిలిపితే కుక్కల దాడి తప్పట్లేదు. వివరాల్లోకెళితే...

బద్వేలు మున్సిపల్‌ పరిధిలోని 33వ వార్డు గాండ్లవీధి, రెడ్డయ్యమఠంవీధి పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో వీధికుక్కలు స్వైర విహారం చేస్తూ పలువురిపై దాడి చేస్తున్నాయి. ఇటీవల గాండ్లవీధి, రెడ్డయ్య మఠంవీధి తదితర ప్రాంతా ల్లో పలువురిపై దాడి చేసి గాయపరిచాయి. చిన్నపిల్లలపై కుక్కలు దాడి చేసి గాయపరుస్తుం టే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కుక్కలను మున్సిపాలిటీ వారు పట్టి ఇతర ప్రాంతాల్లో వదిలేయాలంటూ నివాస ప్రాంతీ యులు కోరుతున్నారు.

ఇదే విషయమై ఇప్పటికే మున్సిపల్‌ కమిషనర్‌కు వినతులు సమర్పించ డం, స్పందన ద్వారా పలువురు ఫిర్యాదులు చేశారు. ఇటీవల చిన్నపిల్లాడిని కుక్కలు దాడి చేసి చంపివేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో చిన్న పిల్లలను బయటికి పంపాలం టే తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాలలకు పంపాలన్నా భయపడే పరిస్థితులు వచ్చాయంటే కుక్కలంటే ప్రజలకు ఎంతభయమో తేటతెల్లం చేస్తోంది. అధికారులు తక్షణమే స్పందించి కుక్కలను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.

ఖాజీపేట బస్టాండు ప్రాంతం నుంచి పీడబ్ల్యూడీ బంగ్లా వరకు ద్విచక్ర వాహనాల్లో వెళ్లాలన్నా గుండెలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. ఎటు నుంచి ఏ కుక్క వెంబడిస్తుందో తెలియక అటూ ఇటు చూస్తూ భయంగా ప్రయాణం చేస్తూ ఒక్కొక్కసారి అదుపు తప్పి కిందపడిపోతున్నారు. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వాహన రాకపోకలతో రద్దీగా ఉం టోంది. ఈ రోడ్డు వెంట వెళతుండగా కుక్కలు వెంబడిస్తే మరో వాహనం కింద పడే ప్రమా దం ఉంది. చీకటిపడితే స్థానికులు ద్విచక్ర వాహనంలో వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉంటే రావులపల్లెలో నాలుగు పొట్టేళ్లను, నాలుగు లేగదూడలను కుక్కలు లాక్కెళ్లి పీక్కుతిన్నాయి. దీంతో ప్రజలు కూడా కుక్కల భయంతో తమ పశువులను కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేయడం, చిన్నపిల్లలను చంపడంలాంటి దుర్ఘటనలు చవిచూశాము. విపరీతంగా పెరిగిపోతున్న ఈ కుక్కలను అధికారులు నియంత్రిచాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు

గుంపులు గుంపులుగా కుక్కలు తిరుగుతూ జనాలపై దాడి చేస్తున్నాయి. పిల్లలను బయటకు పంపాలన్నా భయంతో వణికిపోతున్నాము. రాత్రి సమయంలో వెంటపడుతూ గాయపరుస్తున్నాయి. అధికారులకు వినతిపత్రం అందించినా స్పందించలేదు.

కమలాపురం గౌస్‌, సర్వర్‌ఖాన్‌పేట

రెండు పొట్టేళ్లు, రెండు లేగదూడలు....

మేత కోసం పొలాల్లోకి వెళుతుంటే రెండు పొట్టేళ్లు, రెండు లేగదూడలను కుక్కలు వెంట పడి పీక్కుతిన్నాయి. కుక్కల బెడదతో తీవ్రంగా నష్టపోతున్నాము. మనసులపై కూడా దాడి చేస్తే మా పరిస్థితి ఏంటి. అధికారులు స్పందించి కుక్కలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- నాగేశ్వరరెడ్డి, రావులపల్లె

Updated Date - 2023-03-25T22:45:40+05:30 IST