మహాశక్తి మేనిఫెస్టోతో మహిళలకు సంక్షేమం
ABN , First Publish Date - 2023-07-21T23:54:04+05:30 IST
టీడీపీ అధికా రంలోకి వస్తూనే చంద్రబాబు అమలు చేయ నున్న మహాశక్తి మేనిఫెస్టో మహిళా సంక్షే మానికి ఎంతగానో తోడ్పడుతుందని టీడీ పీ పట్టణ అధ్యక్షుడు భవానిప్రసాద్ పేర్కొ న్నారు.
మదనపల్లె టౌన, జూలై 21: టీడీపీ అధికా రంలోకి వస్తూనే చంద్రబాబు అమలు చేయ నున్న మహాశక్తి మేనిఫెస్టో మహిళా సంక్షే మానికి ఎంతగానో తోడ్పడుతుందని టీడీ పీ పట్టణ అధ్యక్షుడు భవానిప్రసాద్ పేర్కొ న్నారు. శుక్రవారం పట్టణంలోని 10వ వార్డు లో మహాశక్తి రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భవానిప్రసాద్ మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు, తల్లిదీవెన కింద రూ.15వేలు, ఇంట్లోని మహిళలందరికి నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ అధ్యక్షుడు నిస్సార్‌అహ్మద్, మహిళా విభాగం నాయకు రాళ్లు విజయమ్మ, మైథిలి, ప్రమీల, మహాలక్ష్మి, రాధ, ఉషా, జయమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.