సమష్టిగా పనిచేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తాం
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:26 AM
సమష్టిగా పని చేసి జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలుపించుకుంటామని జనసేన కో-కన్వీనర్ గంగారపు రామ్‌దాస్‌చౌదరి పేర్కొన్నారు.
జనసేన నేత గంగారపు రామ్‌దాస్‌చౌదరి
మదనపల్లె, డిసెంబరు 23: సమష్టిగా పని చేసి జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలుపించుకుంటామని జనసేన కో-కన్వీనర్ గంగారపు రామ్‌దాస్‌చౌదరి పేర్కొన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలసి పనిచేస్తామని ఆయా పార్టీల అధినేతలు ప్రకటించడం శుభపరిణామంగా ఆయన పేర్కొ న్నారు. రాజంపేట పార్లమెంటు అభ్యర్థి సుగ వాసి బాలసుబ్రహ్మణ్యం శనివారం మదనపల్లెకు విచ్చేసిన సందర్భంగా స్థానిక కమ్మ వీధిలోని పార్టీ కార్యాలయంలో రామ్‌దాస్‌చౌదరిని కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ నియోజకవర్గంలోని ఇరుపార్టీల పరిస్థితి, 2024 సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. ఈ సందర్భంగా రామ్‌దాస్‌చౌదరి మాట్లాడుతూ టికెట్ ఎవరికి చ్చినా పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకు డు సీడ్ మల్లికార్జుననాయుడు, కంచర్ల శ్రీనివాసులునాయుడు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, పట్టణ ప్రధాన కార్యదర్శి కావలి రెడ్డెమ్మ, మండల ఉపాధ్య క్షుడు చంద్రశేఖర్, జంగాల గౌతమ్, గండికోట లోకేష్, గడ్డం లక్ష్మిపతి, జయశేఖర్, రాజారెడ్డి, మోహనకృష్ణ, కుమార్, ఆదినారాయణ, జనార్దన, పవన, శంకర్ పాల్గొన్నారు.