కర్ణాటక ఎన్నికలకు పూర్తి సహకారం అందిస్తాం
ABN , First Publish Date - 2023-03-18T23:51:12+05:30 IST
కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సరిహద్దు జిల్లా యంత్రాం గం పూర్తి సహకారం అందిస్తుందని అన్నమయ్య కలెక్టర్ గిరీషా పేర్కొ న్నారు.

సరిహద్దుల్లో ప్రవర్తనా నియమావళి అమలు చేస్తాం
అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా
రాయచోటి(కలెక్టరేట్), మార్చి 18: కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సరిహద్దు జిల్లా యంత్రాం గం పూర్తి సహకారం అందిస్తుందని అన్నమయ్య కలెక్టర్ గిరీషా పేర్కొ న్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం పటిష్టమైన భద్రత, ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తామన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిలమత్తూరు చెక్‌పోస్టు సమీపంలోని రక్షక్ అకాడమీలో కర్ణాటక రాష్ట్ర సాధారణ ఎన్నికల సందర్భంగా సరిహద్దు జిల్లాల అధికారులతో సమావే శం ఏర్పాటు చేశారు. మదనపల్లె డివిజన్‌కు సరిహద్దు ప్రాంతాల్లో నిమ్మ కాయలపల్లె, అంకాలమడుగు, చిలకలనేర్పు, కందలమర్రి, ఇనుములపా డు, చెక్‌పోస్టుల్లో పటిష్ట భద్రత చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమం లో అన్నమయ్య, సత్యసాయి జిల్లాల ఎస్పీలు, ఆర్డీఓలు, రవాణాశాఖ అధికారులు, వాణిజ్య పన్నులశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.