ప్రజాస్వామ్య వ్యవస్థకు జీవనాడి ఓటు

ABN , First Publish Date - 2023-01-25T23:44:10+05:30 IST

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు జీవనాడి వంటిదని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరమణయ్య పేర్కొన్నారు

 ప్రజాస్వామ్య వ్యవస్థకు జీవనాడి ఓటు
ప్రొద్దుటూరులో ర్యాలీ చేస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు అర్బన్‌, జనవరి 25 : ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు జీవనాడి వంటిదని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరమణయ్య పేర్కొన్నారు. బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తహసీల్దారు కార్యాలయం నుంచి రాజీవ్‌, శివాలయం సర్కిల్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ఈసందర్బంగా సీనియర్‌ సిజిటన్స్‌కు సన్మానం చేశారు. కార్యక్రమంలో తహసీల్దారు సుబహానీ, ఎంపీడీవో ఉపేంద్రరెడ్డి, ఎన్నికల డిప్యూటీ తహసీల్దారు సుదర్శన్‌, ఆఫీసు డిప్యూటీ తహసీల్దారు మనోహర్‌ రెడ్డి, ఆర్‌ఐ నాగమోహన్‌రెడ్డి, మున్సిపాలిటీ, మండల పరిధిలోని సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

జమ్మలమడుగు..: ఎన్నికలలో 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు సూచించారు. బుధవారం జమ్మలమడుగు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ సభాభవనంలో 13వ జాతీయ ఓటర ్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అత్యధికసార్లు ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్‌ సిటిజన్లను ఘనంగా సన్మానం చేశారు. కొత్తగా ఓటు హక్కు పొందిన యువకులకు ఆర్డీవో, తహసీల్దారు తిరుపతయ్య గుర్తింపుకార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, తహసీల్దారు కార్యాలయ సిబ్బంది, సీనియర్‌ సిటిజన్లు, కొత్త ఓటర్లు, పాల్గొన్నారు.

బద్వేలు..: బద్వేలు పట్టణంలోని ఎస్‌బీవీఆర్‌ డిగ్రీ, పీజీ కళాశాలలో 13వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్‌డీవో కె.వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటసుబ్బారెడ్డి, ఎన్‌ఎ్‌సఎ్‌స సమన్వయకర్తలు దొరస్వామి, ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సీనియర్‌సిటిజన్లను ఘనంగా సన్మానించారు.

పోరుమామిళ్ల..: మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లో బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ నరేష్‌, ఎన్‌ఎ్‌సఎస్‌ కో-ఆర్డినేటర్‌ ప్రకాశ్‌, అకడమిక్‌ కో-ఆర్డినేటరు సులోచన, తహసీల్దారువిజయకుమారి హాజరై సీనియర్‌ సిటిజన్లను సన్మానించారు. అలాగే స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో మానవ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ప్రసాద్‌, మానవ హక్కుల పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ముత్యాల ప్రసాదరావు, కొండయ్య పాల్గొన్నారు.

దువ్వూరు..: దువ్వూరులో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా డిప్యూటీ తహసీల్దారు షఫీ ఆధ్వర్యంలో సీనియర్‌ ఓటర్లను సత్కరించారు. అనంతరం శ్రీ లక్ష్మీ శ్రీనివాస డి గ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటు హక్కు గురించి అవగాహన కలుగజేశారు. ఈ కార్యక్రమంలో సర్వే డిప్యూటీ తహసీల్దారు బాలనారాయణస్వామి, ఆర్‌ఐ జాన్సన్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

బద్వేలు..: పట్టణంలోని నాగభూషణం డిగ్రీ, పీజీ కళాశాలలో బుధవారం జాతీయ ఓటరు దినోత్స వం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపవరం తహసీల్దారు విద్యాసాగర్‌ విచ్చేశారు. ఆర్‌ఐ అమరనాథరెడ్డి , సీనియర్‌ ఎలక్షన్‌ అసిస్టెంటు దక్షిణామూర్తి, కళాశాల పరిపాలనాధికారి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ రాచపూడి సాయ్రిక్రిష్ణ, కళాశాల ఎన్‌ సీసీ సబ్‌ లెఫ్టినెంట్‌ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:44:33+05:30 IST