విశ్వకవి యోగి వేమన
ABN , First Publish Date - 2023-01-19T23:35:07+05:30 IST
ప్రజా కవి యోగివేమన దార్శనికుడు, గొప్ప సంఘ సంస్కర్త, విశ్వక వి అని రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాగదస్తగిరిరెడ్డి పేర్కొన్నారు.
ఘనంగా వేమన జయంత్యుత్సవాలు
పద్య పోటీల్లో విజేతలకు బహుమతులు
ప్రొద్దుటూరు టౌన్, జనవరి 19: ప్రజా కవి యోగివేమన దార్శనికుడు, గొప్ప సంఘ సంస్కర్త, విశ్వక వి అని రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాగదస్తగిరిరెడ్డి పేర్కొన్నారు. గురువారం రెడ్ల కల్యాణ మండపంలో యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు. వేమన చిత్రపటానికి నివాళులర్పించిన ఆయన మాట్లాడుతూ వేమన సమాజ హితం కోసం రచనలు చేశారన్నారు. కులతత్వం, అంటరానితనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. సీపీ బ్రౌన్ వేమన పద్యాలను అచ్చు వేయించి ప్రజలకు చేరువ చేశారని ఆయన వివరించారు. నేటి తరం వారికి వేమన చరిత్రను తెలపాల్సిన అవసరం ఉం దన్నారు.
రాష్ట్రస్థాయి వేమన పద్యపోటీ విజేతల్లో సీనియర్, జూనియర్ విభాగాల్లో మూడు బహుతు లు, మరికొన్ని కన్సొలేషన్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి, ఆప్కాబ్ చైర్మన్ మల్లేల ఝాన్సీరాణి, పోరెడ్డి నరసింహారెడ్డి, బీవీ సుబ్బారెడ్డి, మూలె రామమునిరెడ్డి, గజ్జల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మైదుకూరులో....
మైదుకూరు, జనవరి 19: ప్రజల జీవన స్థితి గతు లు, సామాజిక రుగ్మతలను తన పద్యాల ద్వారా విడమరిచి చెప్పిన మహాకవి వేమనను జాతీయ కవిగా గుర్తించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయు లు రమాదేవి పేర్కొన్నారు. స్థానిక జడ్పీ హైస్కూల్ లో వేయన జయంతి వేడుకల్లో వేమన చిత్రపటాని కి నివాళులర్పించారు. పద్యాల పోటీ విజేతలకు మె మెంటోలు అందచేశారు. కార్యక్రమంలో ఉపాధ్యా యులు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బద్వేలులో....
బద్వేలు, జనవరి 19: వేమన పద్యాలు భావితరాల సంపదని కళాశాల తెలుగు అధ్యాపకులు బి.వి. చలపతి అన్నారు. రాచపూడి నాగభూషణం కళాశా లలో ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో గురువా రం యోగివేమన జయంతి నిర్వహించారు. కళాశా ల పరిపాలనాధికారి వెంకట సాయిక్రిష్ణ, ప్రిన్సిపాల్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
రెడ్డి సేవాసంఘం ఆధ్వర్యంలో....
గుంతపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఎస్‌వీఎస్ మా ర్కెటింగ్ కార్యాలయంలో రెడ్డి సేవాసంఘం ఆధ్వ ర్యంలో యోగివేమన జయంత్యుత్సవాలు నిర్వహిం చారు. సంఘం అధ్యక్షుడు గంగసాని సాంబశివా రెడ్డి మాట్లాడుతూ యోగి వేమన ప్రజాకవిగా, తా త్వికునిగా, జ్ఞానిగా ప్రజాదరణ పొందడం విశేషమ న్నారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు కేవి.సుబ్బా రెడ్డి, బి.సుబ్బారెడ్డి, ఫ్రెండ్స్ సేవాసంఘం ఉపాధ్యక్షు లు సీవి.సుబ్బారెడ్డి, కోశాధికారి ఊరిబిండి జయరా మిరెడ్డి, అంబవరం జయరామిరెడ్డి, కొండారెడ్డి, బిజివేముల రామిరెడ్డి, కె.రమణ పాల్గొన్నారు.
కాశినాయనలో....
కాశినాయన జనవరి 19: కోడిగుడ్లపాడు జడ్పీ హైస్కూల్‌లో వేమన జయంతిని పురస్కరించుకొని పద్యపఠన పోటీలను నిర్వహించినట్లు హెచ్‌ఎం సాంబశివారెడ్డి తెలిపారు. ఈపోటీల్లో విజేతలకు ధృవపత్రాలు, మెడల్స్, వేమన పద్యాల పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో తెలుగు పండింట్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బి.కోడూరులో....
బి.కోడూరు, జనవరి 19: సగిలేరు గురుకుల పాఠశాలలో గురువారం పాఠశాల ప్రిన్సిపాల్ నిరంజన్ ఆధ్వర్యంలో యోగివేమన జయంత్యుత్సవాలు నిర్వహించారు. విద్యార్థులకు పద్యాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు వేమన చిత్రపటానికి పూలమాలలు వేశారు.