గోదాములో విజిలెన్స తనిఖీలు
ABN , Publish Date - Dec 30 , 2023 | 11:58 PM
పట్టణంలో నీరు గట్టువారిపల్లె మార్కెట్ యార్డులోని పౌరసరఫరాల శాఖ గోదామును శనివా రం కడప విజిలెన్స ఎన పోర్స్‌మెంట్ ఇనస్పెక్టర్ రెడ్డెప్ప తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు.
మదనపల్లె అర్బన, డిసెం బరు 30: పట్టణంలో నీరు గట్టువారిపల్లె మార్కెట్ యార్డులోని పౌరసరఫరాల శాఖ గోదామును శనివా రం కడప విజిలెన్స ఎన పోర్స్‌మెంట్ ఇనస్పెక్టర్ రెడ్డెప్ప తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ జిల్లా లోని పౌరసరఫరాల శాఖ గోదాములను తనిఖీలు నిర్వహిస్తూ అందులో భాగంగా మదన పల్లె లోని సివిల్ సప్లయ్ గోదాము ను పరిశీలించామన్నారు. గోదా ములోని నిత్యావసరాల స్టాకు, చౌకదుకాణాలకు పంపిన స్టాకు, నిల్వ ఉన్న స్టాకును, దానికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏవో బాలగంగా ధర్‌రెడ్డి, ఏఈఈకేవి కిషోర్, ఎఫ్‌ఆర్వో జే మురళి పాల్గొన్నారు.