వీరభద్రస్వామి హుండీ ఆదాయం రూ.28.55 లక్షలు
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:10 AM
భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ.28 లక్షల 55 వేల 015 వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్ పర్సన్ పోలంరెడ్డి విజయమ్మ, ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి తెలియజేశారు.
రాయచోటిటౌన్, డిసెంబరు30: భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ.28 లక్షల 55 వేల 015 వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్ పర్సన్ పోలంరెడ్డి విజయమ్మ, ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి తెలియజేశారు. 90 రోజులకు స్వామి వారి హుండీలను లెక్కించగా రూ.26 లక్షల 3 వేల 095లు ఆదాయం, అన్నదానం హుండీ ద్వారా రూ.2 లక్షల 51 వేల 920లు కలిపి మొత్తం రూ.28 లక్షల 55 వేల 015లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కానుకల రూపంలో 48 గ్రాముల బంగారం, 2 కేజీ ల 321 గ్రాములు వెండి వచ్చినట్లు వారు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో డీసీసీ బ్యాంకు సిబ్బంది, సేవకులు, ఆలయ సిబ్బంది పాల్గొనగా జిల్లా దేవాదాయశాఖ జూని యర్ అసిస్టెంట్ రవికుమార్ హుండీల లెక్కింపును పర్యవేక్షించారు.