భక్తి శ్రద్ధలతో వాసవీ మాత ఆత్మార్పణ దినం
ABN , First Publish Date - 2023-01-23T23:29:51+05:30 IST
వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో సోమవారం ఆర్య వైశ్యులు హోమాలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున వాసవీ మాత చిత్రపటాన్ని, కలశాన్ని ఊరేగింపుగా స్థానిక శివాల యానికి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు.
సుండుపల్లె, జనవరి 23: వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో సోమవారం ఆర్య వైశ్యులు హోమాలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున వాసవీ మాత చిత్రపటాన్ని, కలశాన్ని ఊరేగింపుగా స్థానిక శివాల యానికి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయంలో హోమాలు, పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మాటూరి సురేష్, నరసింహులు శెట్టి, మస్తాన్‌శెట్టి, రాచపల్లె సురేష్‌శెట్టి, తపాలాశాఖ సుబ్రమణ్యం, అమర ప్రసాద్, రమేష్‌గుప్తా పాల్గొన్నారు.
రైల్వేకోడూరు(రూరల్): పట్టణంలోని వాసవీ, వనిత క్లబ్‌ల ఆధ్వర్యంలో వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినం కార్యక్రమం నిర్వహిం చారు. వాసవీ మాతకు కుంకుమ పూజ, కన్యకా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ పొన్నూరు నిరంజన్ బాబు, వాసవీ క్లబ్ ప్రధాన కార్యదర్శి తిరుణామల సత్యనారాయణ, కోశాధికారి తిరుణామల కుమార్, వనితా క్లబ్ అధ్యక్షురాలు తేర్ల సునీత, ప్రధాన కార్యదర్శి వేమా మంజుల, కోశాధికారి వేమా నిర్మల తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట టౌన్: రాజంపేట అమ్మవారి శాలలో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదాలు అందజేశారు.
ఒంటిమిట్ట : మండల కేంద్రంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రసిడెంట్ మనోహర్‌బాబు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.