‘వారాహి యాత్ర’ రాజకీయాల్లో పెనుమార్పునకు నాంది
ABN , First Publish Date - 2023-06-11T22:54:12+05:30 IST
జనసేన అధినేత పవనకల్యాణ్ చేపట్టబోతున్న వారాహి యాత్ర ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పునకు నాంది పలుకుతుందని చిట్వేలి మండల జనసేన నాయకుడు మాదాసు నరసింహ తెలిపారు.
చిట్వేలి, జూన 11: జనసేన అధినేత పవనకల్యాణ్ చేపట్టబోతున్న వారాహి యాత్ర ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పునకు నాంది పలుకుతుందని చిట్వేలి మండల జనసేన నాయకుడు మాదాసు నరసింహ తెలిపారు. ఆదివారం చిట్వేలి మండలం జనసేన పార్టీ కార్యాలయంలో వారాహి పోస్టర్‌ను జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ వారాహిని యాత్ర విజయవంతం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం నూతన అధ్యాయం నిర్మాణం కోసం, ప్రజా సమస్యలపై బలమైన పోరాటం చేసేందుకు ఈ నెల 14న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించబోతున్న యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే జనసేన పాలన రావాల్సిందేనని అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఒక వ్యక్తిగా ఆత్మహత్య చేసుకున్న వేలాది మంది కౌలు రైతు కుటుంబాలకు ఆపన్నహస్తం అందిస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలు పవనకళ్యాణ్‌కు ముఖ్యమంత్రి అనే శక్తిని ఇస్తే ఇంకెన్నో సేవలు అందించగలరనే భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పురం సురేష్, కంచెర్ల సుధీర్‌రెడ్డి, మాదాసు శివ, ఆనందల తేజ, షేక్ రియాజ్, తుపాకుల పెంచలయ్య, పగడాల శివ, మోడెం చిరంజీవి, సాంబయ్యగారి నరసింహ, సువ్వా రపు భాను ప్రకాష్, సువ్వారపు హరి, మాదినేని రాజా, పురంగిరి, పెద్దంగారి సాయి, పసల శివ, కడుమూరి సుబ్రహ్మణ్యం, ముత్యాల మహేష్, మోపురుప్రకాష్, పొన్నరెడ్డి సతీష్‌రెడ్డి, సిరిగిరి సుధా, పవనరెడ్డి, గందంశెట్టి వెంకటేష్, సంతోష్, పగడాల సుదర్శన, సుంకర తేజ తదితరులు పాల్గొన్నారు.