వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చండి

ABN , First Publish Date - 2023-03-25T23:17:44+05:30 IST

వాల్మీకి, బోయలు ఎన్నో ఏళ్లుగా ఎస్టీ జాబితా లోనే ఉన్నామని, షరతులు లేకుండా ఎస్టీ జాబి తాను పునరుద్ధరించాలని వాల్మీ కి రిజర్వేషన పోరాటసమి తి రాష్ట్రఅధ్యక్షుడు పొదల నరసిం హులు డిమాండ్‌ చేశారు.

వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చండి
సమావేశంలో ఐక్యత చాటుకుంటున్న వీఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు

మదనపల్లె అర్బన, మార్చి25: వాల్మీకి, బోయలు ఎన్నో ఏళ్లుగా ఎస్టీ జాబితా లోనే ఉన్నామని, షరతులు లేకుండా ఎస్టీ జాబి తాను పునరుద్ధరించాలని వాల్మీ కి రిజర్వేషన పోరాటసమి తి రాష్ట్రఅధ్యక్షుడు పొదల నరసిం హులు డిమాండ్‌ చేశారు. శనివా రం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ఎన్నో ఉద్యమాలు చేపట్టామని దీని ఫలితమే రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో రాయల సీమ ప్రాంతంలోని వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేరు స్తామని బిల్లును ప్రవేశపెట్టి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు పేర్కొందన్నారు. అయితే విభజిం చుపాలించు చందంగా కాకుండా షరతులు లేకుండా ఏపీలోని అన్ని జిల్లాల వాల్మీకు లను ఎస్టీజాబితా లోకి చేర్చాలని డిమాండ్‌ చేశారు. అలా చేయని పక్షంలో రాబోవు ఎన్నికల్లో వాల్మీకుల సత్తా ఏమిటో చూపుతామని ఆయ న హెచ్చరించారు. కార్యక్రమం లో వీఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోగ్గిటి కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి మారకృష్ణ మూర్తి, టౌన అధ్యక్షుడు కొత్తగూడెంశంకర, ఎన నరసింహులు, హరిబాబు, చెన్నం శ్రీరాములు, గణపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:17:44+05:30 IST