టీకాలు తప్పనిసరిగా వేయించాలి
ABN , First Publish Date - 2023-03-05T00:09:00+05:30 IST
నవజాత శిశువులు రోగాల బారిన పడకుండా ఉం డాలంటే టీకాలు తప్పనిసరి అని టీకాలతో వ్యాధుల నుంచి రక్షణ పొం దవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు పేర్కొన్నారు.
వేంపల్లె, మార్చి 4: నవజాత శిశువులు రోగాల బారిన పడకుండా ఉం డాలంటే టీకాలు తప్పనిసరి అని టీకాలతో వ్యాధుల నుంచి రక్షణ పొం దవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు పేర్కొన్నారు. శనివారం స్థానిక 1,7,8 సచివాలయాల పరిధిలోని సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. అనంతరం వైద్యులకు పలు సలహాలు సూచనలు చేశారు. పుట్టిన బిడ్డ నుంచి 16ఏళ్ల వయసు వచ్చే వరకు పలు విడతలుగా ప్రభుత్వం ఉచితంగానే టీకా లు పంపిణీ చేస్తోందన్నారు. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ నిర్దేశించిన కాలమానిని ప్రకారం టీకాలు వే యించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు తాళ్లపల్లె ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వైద్యుడు డాక్టర్ నిజాముద్దీన, హెచఈ షఫీఉన్నీషబేగంలు పట్టణంలోని స్కానింగ్ సెంటర్లను పరిశీలించారు. రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు స్వాతిసాయి, నిజాముద్దీన, హెల్త్ ఎడ్యుకేటర్ షఫి ఉన్నీషాబేగం, సీహెచఓ వెంకటరత్నం, సూపర్వైజర్ వెంకటలక్ష్మి, ఏఎనఎం, ఆశావర్కర్లు పాల్గొన్నారు.