‘ఉర్దూ మీడియం ప్లస్‌2 కళాశాలలను ఏర్పాటు చేయాలి’

ABN , First Publish Date - 2023-05-31T23:44:57+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియం ప్లస్‌2 కళాశాలలను ఏర్పాటు చేయాలని రూటా వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్‌ హిదయతుల్లా, రూటా ప్రధాన కార్యదర్శి స య్యద్‌ ఇక్బాల్‌ డిమాండ్‌ చేశారు.

‘ఉర్దూ మీడియం ప్లస్‌2 కళాశాలలను ఏర్పాటు చేయాలి’

కడప (ఎడ్యుకేషన్‌), మే 31 : రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియం ప్లస్‌2 కళాశాలలను ఏర్పాటు చేయాలని రూటా వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్‌ హిదయతుల్లా, రూటా ప్రధాన కార్యదర్శి స య్యద్‌ ఇక్బాల్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ఏర్పాటు చేసిన 292 ఇంగ్లీషు ప్లస్‌2 కళాకారులల్లో మైనార్టీ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉర్దూ పీజీటీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూటా రాష్ట్ర సమన్వయ కర్త మహ్మద్‌ ఆయుబ్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు షాహిదుల్లా, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి అష్రఫుల్లాబాషా, జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ ఇర్షాద్‌, డైరీ కమిటి ఛైర్మన్‌ అబ్దుల్‌ హకీం, కో చైర్మన్‌ సయ్యద్‌ సిరాజుద్ద్దీన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:44:57+05:30 IST