అకాల వర్షం - అపార నష్టం

ABN , First Publish Date - 2023-03-19T23:19:11+05:30 IST

ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన దెబ్బ కు పండ్లతోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు.

అకాల వర్షం - అపార నష్టం
తువ్వపల్లెలో నేలకొరిగిన మామిడి చెట్టు - తమలపాకు తోటలను పరిశీలిస్తున్న పాడా ఓఎస్డీ, తదితరులు

పండ్లతోటలకు భారీనష్టం

నేలకూలలిన అరటి, తమలపాకు

నీట మునిగిన వేరుశనగ

వేంపల్లెలో పొలాలను పరిశీలించిన పాడా ఓఎస్డీ

వేంపల్లె, మార్చి 19: ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన దెబ్బ కు పండ్లతోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేంపల్లె, చింతలమడుగుపల్లె, చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగులో ఉన్న సుమారు 200ఎకరాల్లో తమలపాకు తోటలు నేలకూలాయి. వందల ఎకరాల్లో అరటితోట దెబ్బతిన్నది. ఇడుపులపాయ, అలిరెడ్డిపల్లె, వీరన్నగట్టుపల్లె తదితర ప్రాంతాల్లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెద్దపెద్ద మామిడి చెట్లు కూలిపోయాయి. పండ్లన్నీ నేలపాలయ్యా యి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకాల వర్షం అపార నష్టం తెచ్చిందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిశీలించిన పాడా ఓఎస్డీ

వర్షంతో దెబ్బతిన్న పంటలను పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, ఏఐసీసీ డైరెక్టర్‌ చంద్ర ఓబుళరెడ్డి, ఎంపీ పీ గాయత్రి పరిశీలించారు. వేంపల్లెలో తమలపాకు తోటలను, ఇడుపులపాయలో మామిడి, అరటి తోటలను పరిశీలించి రైతులతో మా ట్లాడారు. నష్టపరిహారం మంజూరు చేయించేందుకు కృషిచేస్తామని, ఎంతమంది రైతులు నష్టపోయింది వెంటనే అధికారులు నివేదికలు తయారుచేయాలని ఓఎస్డీ ఆదేశించారు. ఉద్యాన శాఖ అధికారి రెడ్డ య్య, ఏఓ రాజేంద్రప్రసాద్‌, ఎంపీటీసీ కటటిక చంద్రశేఖర్‌, ఇడుపులపాయ సర్పంచు చలపతి తదితరులు పాల్గొన్నారు.

పెండ్లిమర్రిలో నీట మునిగిన వేరుశనగ

పెండ్లిమర్రి, మార్చి 19: మండలంలోని పలు గ్రామాల్లో అకాల వ ర్షంతో రైతన్నకు అపారనష్టం కలిగింది. కొత్తగంగిరెడ్డిపల్లె, తిప్పరాజుపల్లె, నాగయ్యపల్లె, బాలయ్యగారిపల్లె తదితర గ్రామాల్లో రైతన్నలు సాగుచేసిన అరటి, వేరుశనగ, టమోట, మిరప, నువ్వులు, ఇలా చేతి కి అందివచ్చిన ప్రతి పంట దెబ్బతిని మండల వ్యాప్తంగా కోట్ల రూపాయాల్లో రైతులకు నష్టం జరిగింది. ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన పంటలు వర్షం వలన దెబ్బతినడంతో ముద్ద దిగడం లేదన్నారు. అప్పు చేసి పంటను సాగుచేసి తీరా చేతికి అందే సమయంలో ఇలా జరగడం వెంటనే రైతన్నలు లబోదిబోమని వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు జరిగిన పంట నష్టా న్ని అంచనా వేసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-19T23:19:11+05:30 IST