టీడీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబుకు క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2023-06-11T23:50:55+05:30 IST

మండల కేంద్రమైన బి.కొత్తకోటలోని జ్యోతి చౌక్‌లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ విభాగం ఆదేశాల మేరకు ఆదివారం తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయు డు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

 టీడీపీ  బీసీ విభాగం ఆధ్వర్యంలో    చంద్రబాబుకు క్షీరాభిషేకం
బి.కొత్తకోటలోని జ్యోతిచౌక్‌లో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న టీడీపీ నాయకులు

పెద్దతిప్పసముద్రం జూన 11 : మండల కేంద్రమైన బి.కొత్తకోటలోని జ్యోతి చౌక్‌లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ విభాగం ఆదేశాల మేరకు ఆదివారం తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయు డు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీడీపీ ప్రవేశపెట్టిన బీసీ రక్షణ చట్టానికి సంఘీభావంగా చంద్రబాబునాయుడిని బీసీలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పని చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను అణిచివేసే విధంగా వ్యవ హరిస్తోందని దుయ్యపట్టారు. బీసీ నాయకులపై అక్రమ కేసులు బనా యించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులను కూడా నమోదు చేస్తున్నారన్నా రు. దానిని సమర్దవంతంగా ఎదుర్కొవడం కోసం ఈ చట్టాన్ని తెచ్చారన్నారు. బీసీలు అభివృద్ధి ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైం దన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్య క్షుడు సురేంద్రయాదవ్‌, తంబళ్లపల్లె నియోజక వర్గ పోల్‌ మేనేజ్మెంట్‌ కో ఆర్డీనేటర్‌ కుడుం శ్రీనివాసులు, రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతినిధి, వడ్డెర సాధికారక పార్లమెంట్‌ అద్యక్షుడు డేరంగుల నారాయణ, రాజంపేట పార్లమెంట్‌ అధికార ప్రతినిధి మొటుకు శివ, దేవరింటి కుమార్‌,ఉపసర్పంచ షమీవుల్లా, శ్రీనాథ్‌, నాగమల్లప్ప, పధ్మనాభం, కిట్టన్న, సూరి శ్రీరాములు, రఘునాథ్‌ నాయుడు, మస్తాన రమణప్ప, అమర, మల్లిఖార్జున,తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T23:50:55+05:30 IST