మూడేళ్లుగా లెక్కతేలని విద్యుత చార్జీల సొమ్ము

ABN , First Publish Date - 2023-06-02T23:37:09+05:30 IST

గృహాలు, ప్రభు త్వ కార్యాలయాల విద్యుత చార్జీల మొండి బకాయిలను ముక్కు పిండి వసూలు చేసే విద్యుత అధికారులు.. ఆ శాఖ ఖాతాలో జమ అయిన విద్యుత సొమ్ములు ఏ మీటర్‌ కు జమ చేయాలో దిక్కుతోచక మూడేళ్లుగా తలలు పట్టుకుంటున్నారు.

మూడేళ్లుగా లెక్కతేలని విద్యుత చార్జీల సొమ్ము

తలలు పట్టుకుంటున్న ఎస్పీడీసీఎల్‌ అధికారులు

మదనపల్లె టౌన, జూన 2: గృహాలు, ప్రభు త్వ కార్యాలయాల విద్యుత చార్జీల మొండి బకాయిలను ముక్కు పిండి వసూలు చేసే విద్యుత అధికారులు.. ఆ శాఖ ఖాతాలో జమ అయిన విద్యుత సొమ్ములు ఏ మీటర్‌ కు జమ చేయాలో దిక్కుతోచక మూడేళ్లుగా తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే మదనపల్లె డివిజన ఎస్పీడీసీఎల్‌ ఖాతాకు చిత్తూరు సర్వశిక్షా అభియాన సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి 2020 మార్చి 13వ తేదీ రూ.8,498, ఇదే తేదీన రూ.13,781, అలాగే మే 5వ తేదీన రూ.19,653 జమ అయ్యాయి. మొత్తం రూ.41,932 ఈ ఖాతాలో జమ అయ్యా యి. కాగా ఈ మొత్తం ఏ విద్యుత సర్వీసు మీటర్‌కు జమ చేయాలో సర్వశిక్షా అభి యాన అధికారులు లేఖ రాయలేదు. ఈ క్రమంలో మూడేళ్లుగా ఈ నగదు ఏ సర్వీసు విద్యుత చార్జీలకు జమ చేయాలో దిక్కుతోచక విద్యుత అకౌంట్సు కార్యాలయం అధికా రులు తలలు పట్టుకుంటున్నారు. శుక్రవారం మదనపల్లె ఎంఈవో కార్యాలయానికి చేరుకున్న ఏఏవో కిరణ్‌కుమార్‌, ఎంఈవో ప్రభాకర్‌రెడ్డితో స్వయంగా సంప్రదించి చిత్తూరు సర్వశిక్షా అభియాన అధికారులతో ఫోనలో మాట్లాడారు. ఇప్పటికైనా విద్యుత చార్జి రూ.41,932 ఏ విద్యుత సర్వీసుకు జమ చేస్తారో వేచి చూడాల్సి వుంది.

రెజ్లర్లకు మద్దతుగా ఉద్యమించాలి

మదనపల్లె, జూన 2: బంగారు పతకాలు సాధించి ప్రపంచ వేదికలపై భారతదేశానికి ఎనలేని గౌరవాన్ని సాధించిపెట్టిన భారత రెజ్లర్లకు మద్దతుగా ప్రతి భారతీయుడు ఉద్యమించాలని విడుదలై చిరుత్తైగల్‌ కట్చి(వీసీకేపార్టీ) రాష్ట్రప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఆ మేరకు శుక్రవారం ఆయన వీకేసీ పార్టీ కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు. తమపై లైగింక వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌ భూషన శరనసింగ్‌పై చర్యలు తీసుకో వాలని రెజ్లర్లు ఇన్నిరోజులుగా ఢిల్లీ రోడ్లపై ఆందోళన చేస్తున్నా..కేంద్రంగాని, ప్రధాని మోదీగాని పట్టించుకోకపోవడం దారుణమ న్నారు. బంగారు బిడ్డలకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోకపోవడం దేశానికే సిగ్గుచేటన్నారు. ఆ ఎంపీని కాపాడుటం కోసం ఆడ బిడ్బలను ఇబ్బంది పెట్టడం, వారి ని కన్నీరు పెట్టించడం ప్రధాని మోదీకి మంచిదికాదని హితవు పలికారు. దేశం కోసం, ధర్మంకోసం నిలబడే వాళ్లందరూ రెజ్లర్లకు మద్దతుగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-06-02T23:37:09+05:30 IST